Begin typing your search above and press return to search.

అందరూ బాగుండాలి.. థియేటర్లలో మనందరం ఉండాలి: ప్రభాస్

By:  Tupaki Desk   |   25 Jun 2021 6:09 PM IST
అందరూ బాగుండాలి.. థియేటర్లలో మనందరం ఉండాలి: ప్రభాస్
X
కమెడియన్ అలీ - సీనియర్ నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''అందరూ బాగుండాలి అందులో నేనుండాలి''. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘వికృతి’ చిత్రానికి తెలుగు రీమేక్‌. అలీవుడ్‌ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలీబాబా - కొణతాల మోహన్ - శ్రీచరణ్‌ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కొందరి ఆకతాయిల వల్ల అమాయకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ వీడియో ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ప్రభాస్ మాట్లాడుతూ.. ''అలీ గారి ప్రొడక్షన్ లో 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' సినిమా వస్తోంది. ఆయన పెట్టిన బ్యానర్ అలీవుడ్‌ ఎంటర్టైన్మెంట్స్.. హాలీవుడ్ అనే విధంగా సౌడింగ్ బాగుంది. ఈ సినిమా మలయాళంలో చాలా పెద్ద హిట్. ఇందులో మంచి మెసేజ్ ఉంది. ఇండస్ట్రీలో మంచి పేరున్న అలీ గారు మంచి మెసేజ్ ఉన్న సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి ఏ.ఆర్‌ రెహమాన్‌ దగ్గర పని చేసిన చేసిన రాకేష్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా కచ్చితంగా బాగుంటది. అలీ గారు - నరేష్ గారు వంటి పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి.. థియేటర్లలో మనందరం ఉండాలి'' అని అన్నారు.

ప్రభాస్ వీడియో ద్వారా తమ సినిమాకు అభినందనలు తెలపడంపై అలీ కృతజ్ఞతలు తెలిపారు. 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' సినిమా ప్రమోషన్‌ ను ప్రభాస్‌ తో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కరోనా పరిస్థితులు చక్కదిద్దుకోగానే విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో మౌర్యానీ - మంజు భార్గవి - ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు నటిస్తున్నారు.