Begin typing your search above and press return to search.

స‌మ్మ‌ర్ సినిమాకి ప్ర‌మాదం పొంచి వుందా?

By:  Tupaki Desk   |   25 March 2022 9:30 AM GMT
స‌మ్మ‌ర్ సినిమాకి ప్ర‌మాదం పొంచి వుందా?
X
టాలీవుడ్ సినిమాల‌కు ప్ర‌తీ సీజ‌న్ ఓ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. సంక్రాంతి, ద‌స‌రా, దీపావ‌ళి ఫైన‌ల్ గా స‌మ్మ‌ర్‌. ఈ సీజ‌న్ ల‌లో అత్య‌ధిక చిత్రాలు సంక్రాంతి, ద‌స‌రా, స‌మ్మ‌ర్ సీజ‌న్ ల‌ని ఎంచుకుంటుంటాయి. ఈ సీజ‌న్ ల‌నే ప్ర‌త్యేకంగా ఎంచుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఈ సీజ‌న్ లో విడుద‌ల చేస్తే భారీ వ‌సూళ్లు ఖాయ‌మ‌ని మ‌న వాళ్లు న‌మ్ముతుంటారు. అది నిజ‌మే కూడా. ఇక స‌మ్మ‌ర్ సీజ‌న్ కి మ‌రీ ప్రాధాన్య‌త నిస్తుంటారు. ఎగ్జామ్స్ పూర్తయిపోవ‌డంతో పిల్ల‌లు, ఫ్యామిలీస్ ఎక్కువ‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంటారు.

ఇది గ‌మ‌నించిన ప్రొడ్యూస‌ర్స్ , అండ్ డైరెక్ట‌ర్స్ త‌మ చిత్రాల‌ని అత్య‌ధికంగా స‌మ్మ‌ర్ లోనే రిలీజ్ చేస్తుంటారు. అయితే ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్ కు ఐపీఎల్ భారీ అడ్డంకిగా మార‌బోతోందా? అంటే అవునంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. 2008లో ఐపీఎల్ మొట్ట‌మొద‌టి సారి స్టార్ట‌యింది. అప్ప‌టి నుంచి ప్ర‌తీ స‌మ్మ‌ర్ సీజ‌న్ ని ఆక్ర‌మించేస్తూ సినిమా క‌లెక్ష‌న్ ల‌పై దెబ్బ‌కొడుతోంది. మార్చి 26న తాజా సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. ఇది మే నెలాఖ‌రు వ‌ర‌కు కంటిన్యూ కానుంది.

అయితే ఇదే స‌మ‌యంలో చాలా వ‌ర‌కు బిగ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఐపీఎల్ కార‌ణంగా భారీ చిత్రాల‌కు క‌లెక్ష‌న్స్ ప‌రంగా భారీ షాక్ త‌గ‌ల‌డం ఖాయం అంటున్నారు. కార‌ణంగా క్రికెట్ అంటే యూత్ టీవీల‌కు అతుక్కుపోతుంటారు. వారి థియేట‌ర్ల‌కు రాక‌పోతే క‌లెక్ష‌న్ ల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా వుంటుంది. ఇప్పుడు ఇదే భ‌యం టాలీవుడ్ ని వెంటాడుతోంది.

తాజా ఐపీఎల్ సీజ‌న్ మార్చి 26 నుంచి మే 29 వ‌ర‌కు జ‌ర‌గ‌బోతోంది. మ‌ధ్యాహ్నం 3:30 నిమిషాల నుంచి ఆట ప్రారంభం కాబోతోంది. ప్రారంభం లో దీని ప్ర‌భావం అంత‌గా వుండ‌క‌పోయినా గేమ్ జ‌రుగుతున్నా కొద్దీ యువ‌త‌లో ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. దీంతో సినిమాని వ‌దిలి ఐపీఎల్ కోసం చాలా వ‌ర‌కు యూత్ టీవీల‌కు అతుక్కుపోవ‌డం జ‌రుగుతున్నాదే. ఈ సారి కూడా అదే రిపీట్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి మే ఎండ్ వ‌ర‌కు విడుద‌ల కానున్న సినిమాల‌పై ఐపీఎల్ ప్ర‌భావం ప‌డ‌బోతోంది. ఏప్రిల్ లో తాప్సీ `మిష‌న్ ఇంపాజిబుల్` వ‌రుణ్ తేజ్ గ‌ని, విశ్వ‌క్ సేన్ `అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం` , మెగాస్టార్ `ఆచార్య‌`, మే లో మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌`, గోపీచంద్ `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`, వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ల `ఎఫ్ 3`, అడివి శేష్ `మేజ‌ర్‌` చిత్రాలు విడుద‌ల కాబోతున్నాయి.

ఈ సినిమాల‌పై ఎంత క్రేజ్ వున్నా ఐపీ ఎల్ ఫైన‌ల్ మ్యాచెస్ తో పాటు హైద‌రాబాద్ మ్యాచ్ స‌మ‌యంలో మాత్రం ఈ చిత్రాల క‌లెక్ష‌న్ లు త‌గ్గ‌డం మాత్రం గ్యారెంటీ అని తెలుస్ఓంత‌ది. మ‌రి ఈ సారి ఎలా వుంటుందో చూడాలి.