Begin typing your search above and press return to search.

మన్మథుడు 2.. ప్రతి సీన్.. లవ్ ఇట్!

By:  Tupaki Desk   |   17 April 2019 2:57 PM GMT
మన్మథుడు 2.. ప్రతి సీన్.. లవ్ ఇట్!
X
అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' ఈమధ్యే సెట్స్ మీదకు వెళ్ళిన సంగతి తెలిసిందే. 'చిలసౌ' సినిమాకు దర్శత్వం వహించి తన సెన్సిబిలిటీస్ తో అందరినీ ఆకట్టుకున్నహీరో రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఒక సీనియర్ హీరోతో జట్టుకట్టడం రకుల్ కు మొదటిసారే అయినా ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది.

తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన రకుల్ దానికో ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. "దర్శకుడి సీట్లో పెద్దన్న రాహుల్ రవీంద్రన్ ఉన్నప్పుడు అంతకంటే బెటర్ విషయం ఏముంటుంది? మన్మథుడు 2 లో ప్రతి ఒక్క సీన్ అందంగా ఉంది.. అంతే. లవ్ ఇట్!!" అంటూ దర్శకుడు రాహుల్ ను ఆకాశానికి ఎత్తేసింది. ఈ ఫోటోలో రకుల్ ఒక బెడ్ పై కూర్చొని ఉండగా సినిమాటోగ్రాఫర్ సమీర్ కెమెరాతో చిత్రీకరణలో బిజీగా ఉన్నారు .. దర్శకుడు రాహుల్ పక్కనే ఒక చెక్క డెస్క్ కు ఆనుకుని నిలబడ్డారు.

ఈ ఫోటోను.. దాంతో పాటు ఉన్న అప్డేట్ ను చూసిన అక్కినేని ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వచ్చింది. అసలే 'మజిలీ' సక్సెస్ తో ఖుషీఖుషీగా ఉన్న వారికి 'మన్మథుడు 2' గురించి ఇలాంటి క్రేజీ అప్డేట్ ఇస్తే ఇక వారి సంతోషానికి అవధులే ఉండవు కదా. రకుల్ చెప్పినట్టే ప్రతి సీన్ అందంగా ఉండాలని.. 'మన్మథుడు' మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేయాలని కోరుకుందాం.