Begin typing your search above and press return to search.

పిక్ టాక్: స్టైలిష్ అండ్ వింటేజ్ లుక్ లో మహేష్..!

By:  Tupaki Desk   |   1 Sept 2021 6:00 PM IST
పిక్ టాక్: స్టైలిష్ అండ్ వింటేజ్ లుక్ లో మహేష్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే 47వ ఏట అడుగుపెట్టారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా తయారవడం మహేష్ లోని ప్రత్యేకత. ప్రస్తుతం మహేష్ ని చూస్తే ఏజ్ అనేది ఆయనకు జస్ట్ నెంబర్ మాత్రమే అని అర్థం అవుతుంది. వింటేజ్ లుక్ లో మునుపటి కంటే హ్యాండ్సమ్ గా ఫిట్ గా కనిపిస్తున్నాడు. అలా మెయింటైన్ చేస్తాడు కాబట్టే మహేష్ కు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

పాన్ ఇండియా సినిమా చేయకుండానే మహేష్ బాబు నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న స్టార్ అని చెప్పవచ్చు. అందుకే హాలీవుడ్ కటౌట్ తో ఉండే సూపర్ స్టార్ ని బ్రాండ్ అంబాసిడర్‌ గా పెట్టుకోడానికి వ్యాపార సంస్థలు పోటీ పడుతుంటాయి. ఇప్పటికే ఎన్నో ఎండార్స్మెంట్స్ కలిగియున్న మహేష్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇప్పుడు మహేష్ బాబు మరో కమర్షియల్ యాడ్ కు సైన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ లో మహేష్ పాల్గొంటున్నారు. దీనికి మత్థియాస్ జంటనెర్ డైరెక్షన్ చేస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనిల్ మెహతా కెమెరాలో మహేష్ ను బంధిస్తున్నారు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తాజాగా ఈ యాడ్ షూట్ మేకింగ్ కి సంబంధించిన ఓ స్టిల్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఇందులో మహేష్ బాబు ఓ సోఫా మీద స్టైలిష్ గా కూర్చొని ఉన్నారు. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో కూల్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నాడు. హైదరాబాద్ లో జరుగుతున్న తాజా షెడ్యూల్ లో రేపటి నుంచి మహేష్ కూడా పాల్గొనున్నారు.

'సర్కారు వారి పాట' చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన బ్లాస్టర్ టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ - మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 28వ సినిమా చేయనున్నారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో పూజాహెగ్డే హీరోయిన్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై రూపొందే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకధీరుడు రాజమౌళి తో మహేష్ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు.