Begin typing your search above and press return to search.

నీ వాలు కళ్ల చూపులు కూడా కవితలు రాస్తాయని..!

By:  Tupaki Desk   |   29 Oct 2021 4:07 AM GMT
నీ వాలు కళ్ల చూపులు కూడా కవితలు రాస్తాయని..!
X
నీ వాలు కళ్ల చూపులు కూడా కవితలు రాస్తాయని... గాలికి నాట్యమాడే ఆ నీలాల కురులు ఏవో ఊసులు కూడా మోసుకొస్తాయ‌ని..! అంటూ క‌వ‌త‌లు అల్లేస్తున్నారు నేటిత‌రం యూత్. అంత‌గా ఫోటోషూట్ల‌తో యువ‌త‌రం కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌డం లేదు మ‌రి. అందుకు త‌గ్గ‌ట్టే క్రేజీ ఆఫ‌ర్ల‌తో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అటు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు యాంక‌ర్ గాను బిజీగా ఉంది. అన‌సూయ నాలుగు చేతులా ఆర్జిస్తున్న మేటి యాంక‌ర్ కం న‌టిగా వెలిగిపోతోంది. టాలీవుడ్ లో ఏ యాంక‌ర‌మ్మకు సాధ్యం కాని ఛ‌రిష్మాతో దూసుకుపోతుంది. ఇంత‌టి బిజీ కెరీర్ వెనుక స‌క్సెస్ సీక్రెట్ ఏదైనా ఉందా? అంటే! న‌టిగాను త‌న‌లో బోలెడంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబ‌ట్టి.

టాలీవుడ్ లో చాలామంది ఫీమేల్ యాక‌ర్లు ఉన్నా.. వాళ్లెవ‌రికీ రాని గుర్తింపు అన‌సూయ‌కి ద‌క్కింది. మార్కెట్ లో ట్రెండీగా నిల‌బ‌డ‌ట‌మే అన‌సూయ స‌క్సెస్ సీక్రెట్ అనొచ్చు. అప్ డేటెడ్ వెర్ష‌న్ లా కాలంతో పోటీప‌డుతూ అన‌సూయ‌ చ‌లాకీత‌నంతో నేటిత‌రాన్ని ఆక‌ట్టుకుంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫోటోషూట్ల‌తో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ల‌కు ధీటుగా నిల‌బ‌డుతోంది. తాజాగా అన‌సూయ కొత్త ఫోటో షూట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. అయితే ఈసారి గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ కి దూరంగా ఎంతో స‌హజ సౌంద‌ర్యంతో ఆక‌ట్టుకుంటోంది. క‌ళ్ల‌కు అద్దిన ఆ న‌ల్ల‌ని కాటుక‌.. తీర్చిదిద్దిన క‌నుబొమలు.. తీరైన ముకు తీరు ఇవి చాలు యూత్ మ‌త్తెక్కిపోయేందుకు. ఇన్నాళ్లు ఆ క‌ళ్ల‌లో దాగిన మెరుపును ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు తీసింది. లైట్ మ్యాక‌ప్ ట‌చప్ తో మ‌త్తెక్కించే క్యూట్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటోంది. మొడ‌లో అంద‌మైన తెల్ల పూస‌ల హారం త‌నలో హాట్ కంటెంట్ ని పెంచేసింది. నీలి రంగు స్కిన్ టైట్ బ్లౌజులో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైల‌ర్ గా మారింది.

అన‌సూయ‌ దూకుడుకు ఎదురే లేదు..!

యాంక‌ర్ స్టాయి నుంచి హోస్ట్ గా.. ఆ త‌రువాత ప్రాధాన్య‌త వున్న న‌టిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది అన‌సూయ‌. జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన ఈ అమ్మ‌డు నాగ్ న‌టించిన `సోగ్గాడే చిన్ని నాయ‌నా` చిత్రంతో ఒక్క‌సారిగా పెద్ద తెర‌పైకి దూసుకొచ్చింది. చెక్క‌ర‌కేళి చిన్నోడే.. అంటూ హోయ‌లు పోతూ నాగ్ తో అన‌సూయ వేసిన స్టెప్పులు ఆమెకు మంచి గుర్తింపుని అందించ‌డంతో పాటు వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌ని తెచ్చిపెట్టింది.

`రంగ‌స్థ‌లం`లో న‌టించిన రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్ అనసూయని న‌టిగా మ‌రో లెవెల్ కి తీసుకెళ్లింది. విభిన్న‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌వాల‌న్న‌ది అన‌సూయ కోరిక‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే న‌ట‌న‌కు ప్రాధాన్య‌త వున్న పాత్ర‌ల్నే ఎంచుకుంటూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. ఇక అన‌సూయ సినిమాల విష‌యానికి వ‌స్తే అల్లు అర్జున్ న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`లో .. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ఆచార్య` లోనూ న‌టిస్తోంది. చిరు గాడ్ ఫాద‌ర్ లోనూ ఓ కీల‌క పాత్ర చేస్తోంద‌ని స‌మాచారం. మ‌రోవైపు ర‌వితేజ హీరోగా తెర‌కెక్కుతోన్న `ఖిలాడీ`లో...క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న `రంగ‌మార్తండ‌`లోనూ కీల‌క పాత్ర‌లు పోషిస్తోంది. `భీష్మ ప‌ర్వం `అనే సినిమాతో ట్యాలెంటెడ్ అన‌సూయ‌ మాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తోంది. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న‌ ఓ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే అన‌సూయ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు సంత‌కం చేసింది. దర్శకుడు సంపత్ నంది ఓ కొత్త ద‌ర్శ‌కుడితో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. అన‌సూయ మునుముందు టాలీవుడ్ లో మ‌రింత బిజీ కానుంది.