Begin typing your search above and press return to search.

స్టార్ హీరో సినిమాలు హిట్ అయినా నిర్మాతకు నష్టాలు!!

By:  Tupaki Desk   |   26 Feb 2020 2:30 PM GMT
స్టార్ హీరో సినిమాలు హిట్ అయినా నిర్మాతకు నష్టాలు!!
X
ఒక సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు నష్టాలు వస్తాయని.. హిట్ అయితే లాభాలు వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అన్ని సినిమాలకు వర్తించదు. టాలీవుడ్ లో ఒక టాప్ స్టార్ ఉన్నాడు. ఆయనతో హిట్ సినిమా తీసినా నిర్మాతకు మాత్రం నష్టాలు తప్పవట. ఒకవేళ ఫ్లాప్ అయిందనుకోండి.. ఇక చెప్పేముంది? నిర్మాతకు పూర్తిగా గుండు అవుతుంది. దీంతో పెద్ద పెద్ద నిర్మాతలే ఆయన పేరు చెప్తే జడుసుకుంటున్నారట. అంతే కాదు.. కొందరు నిర్మాతలు ఆయనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారట.

విషయం ఏంటంటే ఈమధ్య ఆ స్టార్ హీరో నటించిన సినిమాకు దాదాపు రూ.140 కోట్ల షేర్ వచ్చింది. అయితే అసలు నిర్మాతకు మాత్రం రూ.9 కోట్లు నష్టం వాటిల్లిందట. సినిమా ఫైనల్ కలెక్షన్స్ అన్నీ లెక్క తేలిస్తే 32 కోట్ల లాభం వచ్చిందట. అయితే ఈ లాభంలో హీరోగారు సగం.. మరో స్లీపింగ్ పార్టనర్ లాంటి నిర్మాత సగం పంచుకున్నారట. దీంతో ఒరిజినల్ నిర్మాతకు 9 కోట్లు నష్టం వచ్చిందట. కొందరు నిర్మాతలకు ఇలాంటి నష్టాలు రావడం సహజమే. అయితే వారి చేతిలో నాన్-థియేట్రికల్ రైట్స్ ఉంటాయి కాబట్టి అవి మంచి రేట్ పలుకుతాయి. దీంతో ఓవరాల్ గా చూసినప్పుడు లాభాల్లో ఉంటారు. అయితే ఈ సినిమా నిర్మాతకు ఆ అవకాశం లేకుండా నాన్-థియేట్రికల్ రైట్స్ అంతా హీరోగారు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో లాభాలు వచ్చిన సినిమాకు నష్టాలు ఏంటి అంటూ నిర్మాత తలపట్టుకు కూర్చున్నాడట.

ఇక్కడ సమస్య ఏంటి అని చూస్తే హీరోగారు రెమ్యూనరేషన్ తీసుకోను అంటూనే నాన్ థియేట్రికల్ రైట్స్ తీసేసుకుంటాడట. ఇక లాభాలు వస్తే అందులో 30% షేర్ తీసుకుంటాడు. ఇవి కాకుండా పై ఖర్చులు నిర్మాతే పెట్టాలి. దీంతో నిర్మాతకు మిగిలేది శూన్యం. ఈ హీరోగారి తో చివరిగా సినిమాలు చేసిన నలుగురు నిర్మాతలకు ఇదే పరిస్థితి ఎదురయిందట. ఈ వ్యవహారం మరీ శృతి మించుతూ ఉండడం తో నిర్మాతల మండలి లో కంప్లైంట్ ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని ఫిలిం ఛాంబర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.