Begin typing your search above and press return to search.

సాహోలో మ‌రో బాలీవుడ్ భామ‌

By:  Tupaki Desk   |   19 April 2018 9:59 AM GMT
సాహోలో మ‌రో బాలీవుడ్ భామ‌
X
ప్ర‌భాస్ బాలీవుడ్‌లోనూ తెరంగేట్రం చేస్తున్న సినిమా సాహో. అందులో శ్ర‌ద్దాక‌పూర్ హీరోయిన్‌. ఆమె సాహోతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సాహోలో తెలుగు న‌టుల క‌న్నా హిందీ న‌టులే ఎక్కువ మంది ఉన్నార‌న్న టాక్ ఇప్ప‌టికే న‌డుస్తోంది. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ భామ సాహో టీమ్‌లో చేరింది. హాఫ్ జ‌ర్మ‌న్ హాఫ్ ఇండియ‌న్ అయిన ఎవ‌లిన్ శ‌ర్మకు సాహో సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది.

ఎవ‌లిన్ తండ్రి పంజాబీ కాగా త‌ల్లి జ‌ర్మ‌న్‌. జ‌ర్మ‌నీలో పుట్టి అక్క‌డ మోడ‌ల్ గా పేరు తెచ్చుకుని బాలీవుడ్ పాగా వేసేందుకు వ‌చ్చింది. కొన్ని బాలీవుడ్ సినిమాల‌లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఆమె స్వ‌యంగా సాహోలో తాను ఎంపికైన‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. యాక్ష‌న్ రోల్ చేయాల‌న్న త‌న కోరిక సాహో సినిమా తీర‌నుంద‌ని... ఎంత త్వ‌ర‌గా సాహో టీమ్ తో చేరుతానా అని ఎదురు చూస్తున్న‌ట్టు ట్వీట్ చేసింది. త‌న‌కు అవ‌కాశం ఇచ్చినందుకు సుజీత్ ప్ర‌భాస్‌కు థ్యాంక్స్ చెప్పింది. ఇందులో ఆమెది సెకండ్ హీరోయిన్ పాత్ర అని టాక్స్ వినిపిస్తుండ‌గా... మ‌రికొంద‌రు హీరోయిన్ కాక‌పోవ‌డ‌చ్చ‌ని ఏదో కీల‌క పాత్రే అయి ఉంటుంద‌ని అంటున్నారు. ఎవ‌లిన్ కూడా ఈ విష‌యంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు.

సాహో కోసం ఎవ‌లిన్ ప‌ది కిలోలు త‌గ్గిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. సాహో టీమ్ ప్ర‌స్తుతం అబుదాబి దుబాయ్‌ల‌లో షూటింగ్‌ల‌లో పాల్గొంటోంది. త్వ‌ర‌లో ప్ర‌భాస్ కూడా షూటింగ్‌లో పాల్గొనున్నాడు. ఈ సినిమా సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయ‌నున్నారు.