Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కోసం.. సాహోతో సెక్సిణి ఫోటో

By:  Tupaki Desk   |   3 May 2018 4:32 PM GMT
ఫ్యాన్స్ కోసం.. సాహోతో సెక్సిణి ఫోటో
X
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందు కేవలం టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే ప్రభాస్ సినిమాకు సంబందించిన ఫొటోల గురించి స్టిల్స్ గురించి డిమాండ్ చేసేవారు. ప్రభాస్ తో ఆలస్యంగా సినిమా చేసిన ప్రతి దర్శకుడికి ఇలాంటి పరిస్థితి కామన్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సాహో సినిమా కోసం కేవలం టాలీవుడ్ ఆడియెన్స్ అనే కాకుండా కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది సాహో టీమ్ ని ఒకటే డిమాండ్ చేస్తున్నారు.

సినిమా ఎనౌన్స్ చేసి ఏడాది కావొస్తోంది. షూటింగ్ మొదలు పెట్టి కూడా ఏడాదికి దగ్గరపడుతోంది. కానీ సినిమాకు సంబందించిన స్టిల్స్ లో గాని ఇతర విషయాల్లో గాని చిత్ర యూనిట్ ఏ విషయాన్ని అభిమానులకు చెప్పడం లేదనే టాక్ వచ్చింది. సోషల్ మీడియా ద్వారా అభిమానులు సినిమాకు సంబందించిన ప్రతి ఒక్క యాక్టర్ ని సాహో సినిమా విశేషాలేంటి అని అప్డేట్స్ అడిగేస్తున్నారు. అలాగే సినిమా ఫొటోలైన రిలీజ్ చేయాల్సిందిగా ఒత్తిడి పెరుగుతుండడంతో రీసెంట్ గా సాహో నటి ఎవిలిన్ శర్మ రెండు ఫోటోలని భయపెట్టింది.

ప్రభాస్ తో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ అభిమానుల కోరిక మేరకు రిలీజ్ చేస్తున్నట్లు కామెంట్ ను జత చేసింది. అందులో ఎవిలిన్ ప్రభాస్ పక్కన చాలా అందంగా కనిపిస్తోంది. ప్రభాస్ కూడా సరికొత్త లుక్ లో కనిపించడంతో అభిమానులు ఆ పిక్ ను తెగ షేర్ చేసుకుంటున్నారు. అలాగే ఎవిలిన్ సాహో మెయిన్ విలన్ నెయిల్ నితిన్ ముకేశ్ ఆయన భార్య రుక్మిణితో ఒక ఫోటోకి స్టీల్ ఇచ్చారు. ప్రస్తుతం అబుదాబి లో వీరంతా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.