Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: హంతకుడు ఎవరు

By:  Tupaki Desk   |   3 Jun 2019 4:54 AM GMT
ఫస్ట్ లుక్: హంతకుడు ఎవరు
X
క్షణం-గూఢచారి లాంటి విభిన్నమైన చిత్రాలతో సక్సెస్ తో పాటు మంచి మార్కెట్ ని దక్కించుకున్న అడవి శేష్ కొత్త సినిమాకు ఎవరు టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇప్పటిదాకా హడావిడి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించడం మరో విశేషం. ఆగస్ట్ 23 విడుదల ఫిక్స్ చెసుకున్న ఈ క్రేజీ థ్రిల్లర్ మీద మెల్లగా అంచనాలు ప్రారంభమయ్యాయి.

నిజానికి క్షణం విజయం సాధించిన తర్వాత శేష్ తో మరో సినిమా చేసేందుకు పివిపి సంస్థ అప్పుడే ప్లాన్ చేసింది. కాని కార్యరూపం దాల్చడానికి కొంత టైం పట్టడంతో ఫైనల్ గా ఎవరు రూపంలో మనముందుకు వస్తోంది. అయితే దీనికి దర్శకుడు శేష్ కాదు. వెంకట్ రాంజీ దర్శకత్వ బాద్యతలు చేపట్టగా మిగిలిన టెక్నికల్ టీం వివరాలు పోస్టర్ లో పొందుపరచలేదు

ఇప్పుడీ లుక్ లోనూ యాక్టర్స్ ని రివీల్ చేయలేదు. పగిలిన గాజు అద్దం మీద రక్తపు మరకలు చూపించి దాని మీద ఎవరు అని వేశారు అంతే. త్వరలోనే లీడ్ పెయిర్ లుక్ ని రిలీజ్ చేయడంతో పాటు టీజర్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతకాలంగా ఎవరు కోసమే మీడియాకు అందుబాటులో లేని శేష్ ఇకపై ప్రమోషన్ లో పాల్గొనబోతున్నాడు.

దీని తర్వాత సోనీ పిక్చర్స్ మహేష్ బాబు బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న మేజర్ లో శేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న శేష్ రెగ్యులర్ జానర్ కి కట్టుబడకుండా కేవలం థ్రిల్లర్స్ వైపే మొగ్గు చూపడం విశేషం