Begin typing your search above and press return to search.

‘ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌’ ఫస్ట్ లుక్: ఊర మాస్ పాత్రలో సూర్య..!

By:  Tupaki Desk   |   22 July 2021 2:21 PM GMT
‘ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌’ ఫస్ట్ లుక్: ఊర మాస్ పాత్రలో సూర్య..!
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తన 40వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ చిత్రానికి సంబంధించిన రెండు ప్రీ లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి పోస్టర్ లో సూర్య తుపాకీ పట్టుకుని కనిపించగా.. రెండో పోస్టర్ లో కత్తి పట్టుకుని మాస్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో రేపు జులై 23న సూర్య పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్.. ఈ చిత్రానికి టైటిల్ ను ప్రకటించడంతో పాటుగా ఫస్ట్‌ లుక్‌ ని విడుదల చేశారు.

#Suriya40 చిత్రానికి ''ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌'' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ వీడియోలో సూర్య ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. పంచె కట్టులో ఉన్న సూర్య.. ఒక చేతిలో పెద్ద కత్తి మరో చేతిలో తుపాకీ పట్టుకొని విలన్లను వేటాడుతూ కనిపించాడు. ఒక షెడ్ లో రౌడీని ఈడ్చుకుంటూ వచ్చిన సూర్య.. చివరలో పంచె పైకి కట్టుకొని కత్తి పట్టుకొని నిలబడ్డాడు. ఈ వీడియోకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ డి.ఇమ్మాన్‌ అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సూర్య మరో సారి ఊరమాస్‌ పాత్రలో కనిపించనున్నట్లు #Suriya40 ఫస్ట్‌ లుక్‌ వీడియో చూస్తే అర్థం అవుతుంది. గత చిత్రం 'ఆకాశం నీ హద్దురా' తో మెప్పించిన సూర్య.. 'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌' సినిమాలో పూర్తి భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఇందులో ఫ్యామిలీ అంశాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. సూర్య సరసన 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్ గా నటిస్తోంది.

కళానిధి మారన్ సమర్పణలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై 'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో స‌త్య‌రాజ్‌ - జయప్రకాశ్ - శరణ్య పొన్వన్నన్ - సుబ్బు పంచు - దేవదర్శిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జాకీ ఆర్ట్ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తుండగా.. 'కేజీఎఫ్' ఫైట్ మాస్టర్స్ ద్వయం అన్బు - అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. గతంలో సూర్య - పాండిరాజ్‌ కాంబోలో ‘పసంగ 2’(మేము) సినిమాని తెరకెక్కింది. ఈ క్రమంలో వీరి కలయికలో వస్తున్న 'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌' చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.