Begin typing your search above and press return to search.

'షకీలా' మూవీ గురించి నోయల్‌ మాజీ భార్య

By:  Tupaki Desk   |   2 Jan 2021 11:00 PM IST
షకీలా మూవీ గురించి నోయల్‌ మాజీ భార్య
X
తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 లో టాప్‌ కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చిన నోయల్‌ అనారోగ్య కారణాలతో ఎలిమినేషన్‌ అవ్వకుండానే బయటకు వచ్చేశాడు. అతడు లోపల ఉంటే విజేతగా నిలిచేవాడు అని చాలా మంది బలంగా నమ్మారు. నోయల్‌ బిగ్‌ బాస్ ఎంట్రీకి ముందు భార్య ఎస్తేర్‌ తో అధికారికంగా విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. అతి తక్కువ కాలం కలిసి జీవించిన వీరిద్దరు కొన్ని కారణాల వల్ల ముందు ముందు జీవించలేం అనుకున్నారు అందుకే విడిపోయారు. ఇటీవల ఎస్తేర్‌ షకీలా మూవీలో నటించింది. ఆ సినిమా షకీలా పాత్రకు స్నేహితురాలిగా ఎస్తేర్‌ కనిపించింది.

హిందీ.. కన్నడం.. మలయాళంలో విడుదలైన షకీలా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. తెలుగులో విడుదల సందర్బంగా ఎస్తేర్‌ మాట్లాడుతూ తన కెరీర్ లో షకీలా చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. షకీలా పాత్రకు బ్యాక్‌ గ్రౌండ్‌ లో నీడలా ఉండే ట్రైలర్‌ మేడ్‌ పాత్రను చేసినందుకు సంతోషంగా ఉంది. ఆ పాత్ర నాకు చాలా బాగా కనెక్ట్‌ అయ్యింది. సినిమా విడుదల తర్వాత చాలా మంది ఆ పాత్రలో నేను నటించిన తీరుకు అభినందిస్తున్నారు. ఆ పాత్రను నాతో ఎందుకు వేయించారో ఇప్పుడే అర్థం అయ్యింది. తెలుగులో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా తో నా కెరీర్‌ మరింత స్పీడ్‌ గా ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.