Begin typing your search above and press return to search.

క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టిన టాలీవుడ్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   19 Feb 2022 9:35 AM GMT
క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టిన టాలీవుడ్ హీరోయిన్..!
X
సినీ ఇండస్ట్రీని 'క్యాస్టింగ్ కౌచ్' 'మీటూ' ఉద్యమాలు కుదిపేసిన సంగతి అందరికే తెలిసిందే. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ - వేధింపులు సర్వసాధారణమంటూ ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తమ అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తపరిచారు. కొందరైతే ధైర్యంగా వాళ్ళ పేర్లను వెల్లడించి సంచలనం రేపారు. మన టాలీవుడ్ లో కూడా దీనిపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా హీరోయిన్ ఎస్తర్‌ నోరోన్హ ఇండస్ట్రీలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి నోరు విప్పింది.

కొంత విరామం తర్వాత ఇప్పుడు '#69 సంస్కార్ కాలనీ' సినిమాతో కంబ్యాక్ ఇస్తున్న ఎస్తే‌ర్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి ఇండస్ట్రీలో అన్ హెల్తీ వాతావరణం.. కాస్టింగ్ కౌచ్ కూడా ఒక కారణమని వెల్లడించింది. తాను కాస్టింగ్ కౌచ్‌ ను ఎదుర్కొన్నానని.. వాళ్ళని ఇంప్రెస్ చేయమని వీళ్ళను ఇంప్రెస్ చేయమని తన చుట్టూ ఉన్న వ్యక్తులు కోరేవారని తెలిపింది.

ఎస్తర్‌ మాట్లాడుతూ.. ''కాస్టింగ్ కౌచ్ ని రెండు వైపుల నుంచి చూడాలి. ఈ విషయంలో ఎవరో ఒక్కరిది తప్పు అని బ్లేమ్ చేయలేం. వాళ్లు అడగకపోయినా అమ్మాయిల సైడ్ నుంచి ఆఫర్‌ చేసేవాళ్లు ఉన్నారు.. ఆఫర్‌ చేసేవాళ్లు లేకపోయినా అడిగేవాళ్లు ఉన్నారు. కెరీర్ కోసం ఏమైనా చేయడానికి రెడీ అని నాముందు చెప్పిన గర్ల్స్ ఉన్నారు. నన్ను కన్విన్స్ చేయడానికి పాపులర్ హీరోయిన్ల మెసేజ్ లు నాకు చూపించిన సందర్భాలున్నాయి''

''99 మంది అలాంటి వాటికి ఒప్పుకోవడం వల్ల మిగతా ఒక్కరు కూడా అంతేలే అని అనుకుంటారు. అందరూ ముందు వద్దంటారు.. ఏదొక రోజు ఓకే అంటావ్ కదా అనే ఉద్దేశ్యంతో ఉంటారు. కానీ నేను వాటికి దూరంగా ఉన్నాను. నాకు నచ్చినట్లు బ్రతికే మనిషిని నేను. ఇలాంటివి చేసి ఇక్కడే ఉండిపోవాలనుకొనే అమ్మాయిని కాదు. ఒకటే రెండుసార్లు ఆ అమ్మాయి కమిట్మెంట్స్ కు ఒప్పుకోకపోతే.. ఆటోమేటిక్ గా ఆఫర్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఆ అమ్మాయి అలాంటి వాటికి ఒప్పుకోదు అని అప్పటికే స్ప్రెడ్ చేస్తారు''

''ఒప్పుకోకతే కెరీర్‌ ఇక్కడితోనే ముగిసిపోతుంది.. ముందుకు వెళ్లలేరని..నీకంటే వెనుక వచ్చినవాళ్లు ముందుకు వెళ్లిపోతారు. నువ్వు మాట వినకపోతే ఇక్కడే ఆగిపోతావు, గతంలో చాలామందికి ఇలానే అయ్యింది అని.. కెరీర్ ఫినిష్ అని బెదిరిస్తారు. అది నాకు చాలా ఫులిష్ గా అనిపిస్తుంది. సినిమా అంటే నాకిష్టం.. కానీ దానికోసం అంత దిగజారడం అవసరం లేదు. ఛాన్స్‌ రావాలంటే ఇదొక్కటే దారి అంటే నాకు అవసరమే లేదు. అనుకోకుండా అలాంటి సమయంలో నాకు కన్నడ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి.. చేశాను. నాకు రాసిపెట్టి ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చాను'' అని చెప్పుకొచ్చింది.

'వెయ్యి అబద్ధాలు' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్‌ నోరోన్హ.. 'భీమవరం బుల్లోడు' 'గరం' 'జయజానకి నాయక' 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఎస్తర్‌ నటుడు, సింగర్ నోయెల్‌ ని ప్రేమ వివాహం చేసుకోగా వీరి బంధం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఐదారు నెల‌ల‌కే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఎస్తర్‌ '#69 సంస్కార్ కాలనీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.