Begin typing your search above and press return to search.

షాకిచ్చే దృశ్యం! చినుగుల నిక్క‌రులో చిన్న పాప‌!!

By:  Tupaki Desk   |   13 May 2021 2:30 AM GMT
షాకిచ్చే దృశ్యం! చినుగుల నిక్క‌రులో చిన్న పాప‌!!
X
చిట్టి పొట్టి నిక్క‌రు చినుగుల డెనిమ్ లో ఫోజులివ్వ‌డం యువ‌క‌థానాయిక‌ల‌కు కొత్తేమీ కాదు. జాన్వీ క‌పూర్ .. సారా అలీఖాన్.. అన‌న్య పాండే.. ప్రియా ప్ర‌కాష్‌ లాంటి యువ‌నాయిక‌లు.. మ‌లైకా..క‌రీనా లాంటి సీనియ‌ర్ భామ‌లు ఈ ట్రెండ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్ల‌గా ఇప్పుడు ఔత్సాహిక టీనేజీ భామ‌లు ఇదే బాట‌లో ప్ర‌యాణిస్తున్నారు.

బాలీవుడ్ స‌హా సౌతిండ‌స్ట్రీస్ లో ఈ ట్రెండ్ ఇప్ప‌టికే పాపుల‌ర్. తాజాగా దృశ్యం బ్యూటీ .. టీనేజీ గాళ్ ఎస్తేర్ చిట్టి పొట్టి డెనిమ్ షార్ట్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. అస‌లే చినుగుల జీన్స్ .. ఆపై సిగ్గుప‌డుతూ హొయ‌లు పోయింది ఎస్తేర్. ఈ టీనేజీ బ్యూటీ ఇటీవ‌లే రిలీజైన‌ దృశ్యం 2 మ‌ల‌యాళ వెర్ష‌న్ లో క‌నిపించింది.

దృశ్యంలో ఎస్తేర్ అనీల్ గెటప్ పెద్ద‌గా గ్లామరస్ ఎలివేష‌న్ తో ఉండ‌దు. ఒక సాధా సీదా అమ్మాయిలా ప‌క్కింట‌మ్మాయిలానే క‌నిపిస్తుంది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలంలో పాపుల‌ర‌వుతోంది. 19ఏళ్ల ఈ బ్యూటీ అంద‌మైన చిరున‌వ్వు.. తీర్చిదిద్దిన క‌నుబొమ‌ల‌తో ఆక‌ట్టుకుంటోంది. ఆల్మోస్ట్ మేక‌ప్ లెస్ గా క‌నిపిస్తోంది ఈ భామ‌. ఎస్తేర్ కి మ‌ల‌యాళం స‌హా తెలుగులోనూ మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని ఆకాంక్షిద్దాం.