Begin typing your search above and press return to search.

దృశ్యం చిన్నారి.. ఈ రచ్చేమిటి బాబోయ్!

By:  Tupaki Desk   |   16 Jan 2023 3:30 AM GMT
దృశ్యం చిన్నారి.. ఈ రచ్చేమిటి బాబోయ్!
X
వెంకటేష్ దృశ్యం సినిమాలో నటించిన చిన్నపిల్ల ఎస్తర్ అనిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దృశ్యం పార్ట్ వన్ లో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. 2014లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ సినిమా సమయంలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తర్ అనిల్ వయస్సు 13 ఏళ్ళు ఉంటాయి.

ఆ వయస్సులో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. తరువాత మరల ఈ చిన్నారి 2021లో దృశ్యం సీక్వెల్ లో నటించింది. ఈ సినిమా టైంకి ఎస్తర్ యంగ్ బ్యూటీగా మారిపోయింది. హీరోయిన్ ఫీచర్స్ తో ఆకట్టుకునే రూపంతో ప్రేక్షకులకి చేరువ అయ్యింది. తెలుగులో జోహార్ అనే వెబ్ మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంది.

అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడు పొట్టిపొట్టి డ్రెస్సులతో, హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో మెస్మరైజ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఈమెకి భాగా పాపులారిటీ ఉంది. ఈమె పెట్టె ఫోటోలకి వేల నుంచి లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. మాతృభాషలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ప్రయత్నం చేస్తుంది.

అలాగే తెలుగులో కూడా హీరోయిన్ ఛాన్స్ ల కోసం వేచి చూస్తుంది. సరైన ప్రాజెక్ట్ ఒకటి పడితే హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఎస్తర్ అనిల్ సిద్ధం అవుతుంది. అందుకు తగ్గట్లుగానే దర్శకులని ఎట్రాక్ట్ చేసే పనిలో ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి వయస్సు 21 ఏళ్ళు. తాజాగా ఈ బ్యూటీ పొట్టి స్కర్ట్ తో తీసుకున్న ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాండిచ్చేరిలో దిగిన ఫోటోలని ఇన్స్టాలో షేర్ చేసింది. వీటిని ఏకంగా 1 లక్ష 38 వేల మందికి పైగా వీక్షించడం విశేషం. మరి ఈ బ్యూటీ సోయగాలు చూసిన తర్వాత అయిన దర్శక నిర్మాతలు ఈ అమ్మడుకి హీరోయిన్ గా అవకాశం ఇస్తారేమో చూడాలి.