Begin typing your search above and press return to search.

వెంకీ డాట‌ర్.. చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా..!

By:  Tupaki Desk   |   23 Dec 2021 4:30 PM GMT
వెంకీ డాట‌ర్.. చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా..!
X
విక్ట‌రీ వెంక‌టేష్ నటించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ దృశ్యంలో న‌టించింది క్యూట్ ఎస్తేర్. అప్ప‌టికి చిన్న పాపాయి. కానీ ఇప్పుడు ఎలా ఉంది? అంటే క‌థానాయిక‌లా నిగ‌నిగ‌ల‌తో మెరిసిపోతోంది! అంటూ యూత్ ఒక‌టే క్ర‌ష్ ఫీల‌వుతున్నారు. మలయాళం- తెలుగు- తమిళ భాషల్లో తెర‌కెక్కిన `దృశ్యం` సినిమాల్లో నటించిన ఎస్తేర్ అనిల్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా క‌నిపిస్తూ షేక్ చేస్తోంది. ఒక బాల‌న‌టి ఇంతలోనే ఎంత‌గా మారింది? అంటూ బోయ్స్ ఒక‌టే షాక్ అవుతున్నారు.

అందాల ఎస్తేర్ వయసు 20. ఘాటైన ఫోజుల‌తో గుబులు పుట్టిస్తోంది. తాజా ఫోటోషూట్ కోసం బ్లూ ఎథ్నిక్ దుస్తుల్లో పోజులిచ్చి త‌న‌లోని అందాల‌ను ప్రదర్శించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఎస్తేర్ ప్ర‌ద‌ర్శ‌న చూస్తుంటే మునుముందు క‌థానాయిక‌గా స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని అర్థ‌మవుతోంది. ఎస్తేర్ అభిరుచి ఆస‌క్తిక‌రం. పాటల సాహిత్యం.. కోట్ లతో ఫోటోల‌కు క్యాప్షన్ లు ఇచ్చింది. ఎస్తేర్ అనిల్ తన నటనా జీవితాన్ని 2010లో ప్రారంభించింది. దృశ్యం త‌ర్వాత దృశ్యం 2లోనూ ఎస్తేర్ న‌టించింది. తెలుగులో ప‌లువురు నిర్మాత‌ల దృష్టిలో ప‌డింది ఈ అమ్ముడు. త‌న నుంచి ఏదైనా పెద్ద ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుందేమో చూడాలి.