Begin typing your search above and press return to search.

#టూ గ్లామ‌రస్.. వెంకీ చిన్న కూతురు దుమారం

By:  Tupaki Desk   |   20 Nov 2021 12:30 AM GMT
#టూ గ్లామ‌రస్.. వెంకీ చిన్న కూతురు దుమారం
X
`దృశ్యం` సినిమాలో వెంక‌టేష్ రెండ‌వ కుమార్తెగా న‌టించిన ఏస్తేర్ అనీల్ అంద‌చందాలు ప్ర‌తిభ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏస్తేర్ చ‌క్క‌ని న‌ట‌నాభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీకి మంచి పేరొచ్చింది.  మ‌ల‌యాళంలోనూ ఏస్తేర్  విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. అప్పుడు ఐదారేళ్ల పాపాయిలా క‌నిపించిన ఏస్తేర్  ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. `ఒళు` అనే మాలీవుడ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్ అనీల్..అటుపై మోహ‌న్ లాల్ న‌టించిన దృశ్యం-2లోనూ త‌న పాత్ర‌ను కొన‌సాగించింది. తెలుగు రీమేక్ వెర్ష‌న్ లోనూ పార్టు -2లో నటిస్తోంది. ఇంకా `జోహార్` అనే సినిమాలోనూ హీరోయిన్ గా న‌టించింది.

అయితే ఏస్తేర్ అనీల్ పెద్ద హీరోయిన్ గా పాపుల‌ర్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. త‌న‌పై ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ట్యాగ్ ని చెరిపేసుకుని న‌టిగా ఎస్టాబ్లిష్ అవ్వాల‌ని సీరియ‌స్ ప్ర‌య‌త్నాల్లో  ఉంది. దీనిలో భాగంగా గ్లామ‌ర్ ఎలివేష‌న్ పాత్ర‌ల‌కే ముఖ్యపాత్ర ఇస్తోంది. అందులోనూ తెలుగు సినిమాలు ఎక్కువ‌గా చేయాల‌ని ఆశ‌ప‌డుతోంది. మీడియం రేంజ్ హీరోల స‌ర‌స‌న న‌టించాల‌ని మేనేజ‌ర్ ని నియ‌మించుకుని ముందుకెళుతున్న‌ట్లు స‌మాచారం. ఇక ఏస్తేర్ అనీల్ డిజిట‌ల్ యుగంలో య‌మా స్పీడ్. సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా ఫాలోవ‌ర్స్ కి ట‌చ్ లో ఉంటుంది. ఇన్ స్టాలో 1మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ త‌న‌కు ఉన్నారు.

టెంప్టింగ్ ఫోటోల‌తో ఎటాక్ చేయ‌డం స‌ద‌రు కుర్ర హీరోయిన్ స్పెషాలిటీ. తాజాగా ఓ కొత్త ఫోటోని ఎస్తేర్ అనీల్ షేర్ చేసింది. బ్రౌన్ క‌ల‌ర్ డిజైన‌ర్  టాప్.. వైట్ ఫ్యాంట్ లో ఎద అందాల విందు చేసింది. చేతిలో గ్లాస్ తో జ్యూస్ తాగుతూ అమ్మ‌డు కెమెరాకి ఫోజులిచ్చింది.  ఈ ఫోటోల‌కి ల‌క్ష‌ల్లో లైకులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. ఏస్తేర్ అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తోంది.