Begin typing your search above and press return to search.

వైరల్: చీరకట్టి మరీ డ్యాన్సులో ఇరగదీసింది

By:  Tupaki Desk   |   26 Sept 2020 4:20 PM IST
వైరల్: చీరకట్టి మరీ డ్యాన్సులో ఇరగదీసింది
X
మహిళల అందానికి మరింత కళను తెస్తాయి చీరలు. మన సంప్రదాయానికి నిదర్శనమైన చీరలు కట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో పర్ ఫెక్ట్ గా పనులు చేయాలన్నా.. ఇతర ఆటలు పాటలకు ఈ చీరలు అంతగా సౌకర్యంగా ఉండవన్న వాదన ఉంది. చీరలు ధరించి మహిళలు డ్యాన్స్ లు చేయడం.. పరిగెత్తడం లాంటివి చేయడం చాలా కష్టం. డ్యాన్సులు మాత్రం చిన్న చిన్న స్టెప్పులతో కానిచ్చేస్తారు.

తాజాగా ఢిల్లీకి చెందిన డ్యాన్సర్ ఎష్నాకుట్టి ఆరు గజాల చీరతో అసాధారణమైన ‘హులా హూప్’ నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చీరలతో డ్యాన్స్ చేయడం కష్టమనే వాదన ఉంది. కానీ చీరతో చేయాలని అనిపించి హులా హూప్ డ్యాన్స్ చేశాను. ‘సారీ ఫ్లో హ్యాష్ ట్యాగ్’తో ఆమె షేర్ చేసిన ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.

మహిళలు చీరపై సున్నితంగానే ఉంటారు. కానీ ఈమె దానిపై ఇరగదీసేలా డ్యాన్స్ చేసి వారందరికీ భరోసాను కల్పించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షలమంది నెటిజన్లు చూశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఈ వీడియో చూసి ప్రశంసలు కురిపించారు.