Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ హీరోయిన్ హీట్ పెంచింది

By:  Tupaki Desk   |   16 July 2018 2:48 PM IST
ఎన్టీఆర్ హీరోయిన్ హీట్ పెంచింది
X
ఈ రోజుల్లో హీరోయిన్లు ట్రెడిషనల్ గానే కనిపిస్తామంటూ మడికట్టుకుని కూర్చుంటే కష్టం. గ్లామర్ టచ్ ఇవ్వకుండా గ్లామర్ ఇండస్ట్రీలో ఎంతో కాలం కొనసాగడం కుదరదు. అందుకే కెరీర్ ఆరంభంలో ట్రెడిషనల్ ముద్ర వేయించుకున్న హీరోయిన్లు కూడా తర్వాత తర్వాత రూటు మార్చేస్తున్నారు. మామూలుగా తెలుగు హీరోయిన్లంటే గ్లామర్ గా కనిపించాడనికి ఒప్పుకోరనే అభిప్రాయం బలపడిపోయింది. వాళ్లకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కకపోవడానికి కూడా అదొక కారణం. కానీ ఈ తరం తెలుగు హీరోయిన్లు ట్రెడిషనల్ ఛట్రం నుంచి బయటికి రావడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

తొలి సినిమా ‘అంతకుముందు ఆ తరువాత’లోనే తన టాలెంట్ ఏంటో చూపించి.. ఆ తర్వాత ‘అమీతుమీ’తో ఆకట్టుకున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. ఈ మధ్య తనలోని గ్లామర్ కోణాన్ని చూపించడానికి బాగానే ట్రై చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సరసన నటించే ఛాన్సొచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’లో ఈషా రెండో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఊపులో ఈషా గ్లామర్ డోస్ పెంచుతోంది. తాజాగా ఆమె స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్లామరస్ గా తయారై ఒక హాట్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. ఇప్పటికే నటిగా ప్రూవ్ చేసుకున్న ఈషా.. ఈ ఫొటో ద్వారా తాను గ్లామర్ లోనూ తీసిపోనని చాటిచెబుతోంది. కుర్రాళ్లలో ఈ కొత్త ఫొటో హీట్ పెంచుతోంది. ‘అరవింద సమేత’ గనుక హిట్టయి ఈషాకు పేరు తెస్తే మున్ముందు ఆమె పెద్ద సినిమాల్లో బాగానే బిజీ అయ్యే అవకాశముంది.