Begin typing your search above and press return to search.

వెంకీ సినిమాలో కుండ మార్పిడి

By:  Tupaki Desk   |   5 March 2018 5:47 AM GMT
వెంకీ సినిమాలో కుండ మార్పిడి
X
ఇప్పుడంటే ఈ మాట తక్కువగా వింటాం కాని పెద్దవాళ్ళను అడిగితే కుండమార్పిడి అనే పదానికి అర్థాన్ని బాగా వివరిస్తారు. మనం ఒకరింట్లో అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవడానికి అవతలి వైపు నుంచి కూడా రివర్స్ లో మన ఇంట్లో వాళ్ళతో ముడి పెట్టించే పద్ధతే కుండమార్పిడి. సింపుల్ గా చెప్పాలంటే నేను మీ అక్కను చేసుకోవాలంటే నువ్వు మా చెల్లిని చేసుకోవాలి అనే స్కీం అన్నమాట. ఇప్పుడు దీన్నే వెంకటేష్ కొత్త సినిమా కోసం వాడుతున్నట్టు టాక్. తేజ దర్శకత్వంలో మార్చ్ 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోబోతున్న ఈ మూవీలో వెంకీతో పాటు నారా రోహిత్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొదట సీతమ్మ వాకిట్లో తరహాలో అన్నదమ్ములేమో అనుకున్నారు కాని అది నిజం కాదట.

విశ్వసనీయ సమాచారం మేరకు ఇద్దరు బావ బావరమరుదులగా కనిపిస్తారట. వెంకటేష్ నారా రోహిత్ అక్కయ్య శ్రేయను చేసుకుంటే బదులుగా వెంకీ చెల్లెలు ఈశా రెబ్బాను రోహిత్ చేసుకుంటాడన్న మాట. పైన చెప్పిన కుండ మార్పిడి ఫార్ములా ఇదే. ఇది అనధికారికంగా బయటికి వచ్చిన వార్తే. మంచి ఫ్యామిలీ డ్రామా వీళ్ళ మధ్య దర్శకుడు తేజ సెట్ చేసాడని తెలిసింది. దానితో పాటు యాక్షన్ ఎలెమెంట్స్ కూడా బాగా దట్టించి వెంకటేష్ ఫాన్స్ కి మంచి జోష్ ఇచ్చేలా స్క్రిప్ట్ సిద్ధం చేయించాడని తెలిసింది. ఆటా నాదే వేటా నాదే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి దసరా బరిలో దించేలా ప్లానింగ్ జరుగుతోంది.

అ!! లో స్వలింగ భాగస్వామిని కోరుకునే పాత్రలో మెప్పించిన ఈశా రెబ్బకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పోచ్చు. లాస్ట్ ఇయర్ అమీ తుమితో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈషకు ఇది మంచి ఆఫర్. ఎన్టీఆర్ బయోపిక్ కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉండటంతో తేజ తన పూర్తి ఫోకస్ వెంకీ సినిమా మీదే పెట్టనున్నాడు. ఇది పూర్తయ్యాక వెంకీ త్రివిక్రమ్ సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయి.