Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ లో తెలంగాణ హీరోయిన్?

By:  Tupaki Desk   |   5 July 2017 7:55 AM GMT
బిగ్ బాస్ లో తెలంగాణ హీరోయిన్?
X
వచ్చే జూలై 16 నుండి జూ.ఎన్టీఆర్ తొలిసారిగా బుల్లితెరపై కనిపించనున్న బిగ్ బాస్ కార్యక్రమం షురూ కానుంది. ఈ సందర్భంగా అసలు ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్లు ఎవరంటూ భారీ ఉత్కంఠతే సాగుతోందిలే. పోసాని సుమ అనసూయ రష్మి నవదీప్ తరుణ్‌ ఇలా చాలా పేర్లే వినిపించాయి కాని.. ఏ ఒక్కటీ ఇంతవరకు కన్ఫామ్ కాలేదు. అయితే ఒక్క పేరు మాత్రం పక్కా అని తెలుస్తోంది.

నిజానికి బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి చాలామంది హీరోయిన్లకు ఆడిషన్లు నిర్వహిస్తున్నారా తెలుసా? ఈ ఆడిషన్లో పాల్గొని సెలక్ట్ అయితే.. 70 రోజులపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి కాంట్రాక్ట్ సైన్ చేయాలాట. అటువంటి ఆడిషన్స్ లో తెలంగాణ హీరోయిన్.. వరంగల్ పిల్ల అయిన ఈషా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ అమ్మడికి దాదాపు రోజుకి లక్ష రూపాయలు పారితోషకం కూడా ఇస్తామన్నారట. సినిమాల్లో ఇంద్రగంటి సినిమాలు తప్పిస్తే వేరే సినిమాలను పెద్దగా సైన్ చేయని ఈ భామ.. మరి బిగ్ బాస్ లోకి వెళ్దాం అని ఎలా అనుకుందో అంటూ అందరూ స్టన్ అయ్యారు.

ఏదేమైనా కూడా 16వ తారీఖు వస్తే కాని.. అసలు బిగ్ బాస్ లో ఎవరు రచ్చచేస్తారు ఎవరు చేయట్లేదు అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఒక విధంగా చూస్తే కేవలం తెలుగు బాగా మాట్లాడటం వచ్చినవారినే తెలుగు బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నారట. అందుకనే చాలామంది యంగ్ టాలీవుడ్ హీరోయిన్స్ మాతృబాష తెలుగు కావడంతో అవకాశం కోల్పోయారట. అది సంగతి.