Begin typing your search above and press return to search.

అమీ తుమీ అంటూ ఎక్స్ పోజింగ్

By:  Tupaki Desk   |   4 Jun 2017 5:43 AM GMT
అమీ తుమీ అంటూ ఎక్స్ పోజింగ్
X

ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలు అంటే.. కుటుంబం మొత్తం కూర్చుని హాయిగా నవ్వుకునే తరహాలో ఉంటాయని అనేందుకు సందేహం లేదు. అష్టా చెమ్మా నుంచి.. రీసెంట్ గా జెంటిల్మన్ వరకు.. ఎక్కడా హీరోయిన్లతో కొంచెం కూడా ఎక్స్ పోజింగ్ చేయించలేదు. అందుకే ఈయన సినిమాల్లో నటించేందుకు ఏ హీరోయిన్ అయినా సై అనేస్తుంటుంది.

ఇప్పుడు అమీ తుమీ అంటూ కొత్త సినిమా రూపొందిస్తున్నాడు ఇంద్రగంటి. ఇందులో కూడా హీరోయిన్లకు గ్లామర్ చూపించేదుకు ఎలాంటి స్కోప్ ఉండకపోవచ్చు. కానీ పబ్లిసిటీ విషయంలో మాత్రం హీరోయిన్ ఈషా.. బోలెడంత గ్లామర్ కురిపించేస్తోంది. రీసెంట్ గా ఓ ఎఫ్ ఎం ఛానల్ లో ప్రచారం చేసేందుకు వెళ్లిన ఈ భామ.. అక్కడ కూడా కొంచెం కొంచెం సోయగాలను చూపించేలా డ్రెసింగ్ చేసుకువెళ్లడం ఆశ్చర్యకరం. ఎఫ్ ఎం ఛానల్ నుంచి వినపడ్డమే తప్ప జనాలకు కనిపించే ఛాన్స్ లేదని ఆ భామకి కూడా తెలుసు కానీ.. ఫోటో షూట్స్.. వీడియో ఇంటర్వ్యూల కోసమే ఇలా కష్టపడింది ఈషా.

టాలీవుడ్ లో ఎప్పటి నుంచో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈషా.. అమీతుమీతో సక్సెస్ సాధించాలని ఫిక్స్ అయిపోయినట్లుగా ఉంది. అంతకు ముందు ఆ తర్వాత.. బందిపోటు వంటి చిత్రాలు ఇవ్వలేకపోయిన బ్రేక్.. ఈ చిత్రం అయినా ఇస్తుందన్నది ఈమె ఆశ. అందుకే దర్శకనిర్మాతలు అడిగినా అడక్కపోయినా.. ఇలా అందాలు కురిపిస్తూ ప్రచారం చేస్తోందని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/