Begin typing your search above and press return to search.

రెక్కల మీద ఎగిరిపోతానంటూ ట్యాటూ

By:  Tupaki Desk   |   16 Jun 2017 7:21 AM GMT
రెక్కల మీద ఎగిరిపోతానంటూ ట్యాటూ
X
జన్నత్2.. రాజ్3 వంటి చిత్రాలతో కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న మిస్సిండియా బ్యూటీ ఈషా గుప్తా. రీసెంట్ గా తూతక్ తూతక్ తూతియా (తెలుగులో అభినేత్రి)లో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసి మెప్పించేసింది. ఈషాకు అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు.

దర్శకులు అడిగినంతగా చూపించేందుకు అడ్డంకులు కూడా పెట్టుకోదు. మరోవైపు ఫోటోషూట్స్ తో కూడా ఈ బ్యూటీ తెగ రెచ్చగొట్టేస్తూ ఉంటుంది. తాజాగా ఈ సుందరాంగి తను స్పెషల్ గా వేయించుకున్న టాటూను డిస్ ప్లే చేసేందుకు ఇంకా స్పెషల్ గా తీయించుకున్న ఫోటో ఒకటి నెట్ లో షేర్ చేసింది. ఎడమవైపున నడుము పై భాగంలో.. తన అందాలకు పక్కగా.. ఒంట్లో అత్యంత మెలికలు కలిగే ప్రాంతంలో ట్యాటూ వేయించుకుంది ఈషా గుప్తా. ట్యాటూ సంగతేమో కానీ.. దాన్ని చూపించేందుకు టాప్ ను కొంచెం పైకి ఎత్తి పట్టుకున్న ఫోటో మరీ వయ్యారంగా ఉంది. అసలు అలాంటి ప్లేస్ లో ట్యూటూ వేయించుకోవడం.. ఇలాంటి యాంగిల్ లో ఫోటోకు పోజ్ ఇవ్వడం అంటేనే.. ఈషా గుప్తా ఎంతటి డేరింగ్ అనే సంగతి అర్ధమైపోతుంది.

ఇకపోతే ఆ టాటూ అర్ధం ఏంటనేగా మీరు చూస్తోంది.. అక్కడ లాటిన్ లో ''అలిస్ వొలాట్ ప్రొప్రీస్'' అని రాసుంది. అంటే అర్ధం ఏమనగా.. ''తన రెక్కల మీద తాను ఎగురుతుంది'' అనమాట. పోన్లేండి మరి.. కెరియర్ ఎగిరితే అంతే చాలు ఈ భామామణికి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/