Begin typing your search above and press return to search.

ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా ఈషా!

By:  Tupaki Desk   |   27 Feb 2018 10:18 PM IST
ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా ఈషా!
X
ఇంటర్నెట్ అంటే ఈ రోజుల్లో మంచి చెడు బాధ కోపం అన్ని కలగలలిపిన ఒక రూపం లేని మనిషిలా తయారైంది. ఎక్కువగా నెగిటివ్ అనిపించే ఆలోచనలే అందులో మొదలవుతున్నాయి. సెలబ్రెటీలు అయితే పాజిటివ్ గా ఉండే ప్రతి ఆలోచనని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. కానీ నెటీజన్స్ మాత్రం వారికి డిఫెరెంట్ స్టైల్ లో కౌంటర్లు వేస్తున్నారు. రీసెంట్ గా అదే తరహాలో ఒక బ్యూటీకి కౌంటర్ల మీద కౌంటర్లు పడ్డాయి.

ఆమె ఎవరో కాదు ఇంటర్నెట్ సెక్సీ బాంబ్ ఈషా గుప్తా. ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియా వాడే వారికి తప్పకుండా తెలిసే ఉంటుంది. దాదాపు అన్ని కోణాల్లో స్కిన్ షో ప్రజెంట్ చేసి ఇమేజ్ తెచ్చుకుంది. చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ నే ఎక్కువగా అందుకుంది. ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. సిరియాలో కొనసాగుతున్న సంక్షోభం గురించి అమ్మడు ట్వీట్ చేసింది. దీంతో నెటీజన్స్.. ఇప్పుడు తమరికి జ్ఞానోదయం అయ్యిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సిరియాలో రక్తపాతం నడుస్తోంది. మానవత్వం చనిపోతోంది. పిల్లలు మరణిస్తున్నారు దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది అంటూ ఈషా ఓ ట్వీట్ అలా వేసిందో లేదో.. కౌంటర్లు ఓ లెవెల్లో అందుతున్నాయి. ఏసీ రూములో కూర్చొని ట్వీట్ చేయడం కాదు. వీలైతే వెళ్లి సహాయం చేయి అని ఎవరి స్టైల్ లో వారు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు బికినీలో ఫొటో షూట్ లు సెల్ఫీలు అంటూ బిజీగా ఉండే ఈషా ఇలా మాట్లాడుతుందేంటని కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువగా.. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా మేడమ్ అని కౌంటర్స్ ఇస్తున్నారు.