Begin typing your search above and press return to search.

వేధింపుల‌ పై హాట్ భామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   30 Oct 2021 5:50 AM GMT
వేధింపుల‌ పై హాట్ భామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
కాస్టింగ్ కౌచ్ పై ఇప్ప‌టికే ప‌లువురు న‌టీమ‌ణులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దేశంలో చాలా ర‌కాల ప‌రిశ్ర‌మ‌లు ఉన్నా టాలీవుడ్.. కోలీవుడ్ ..బాలీవుడ్ లో మాత్రం ఈ వ్య‌వ‌హారం ప‌రాకాష్ట‌లో ఉంద‌ని ఆరోపించారు. గాయ‌ని సింగ‌ర్ చిన్మ‌యి ఎంట్రీతో కాస్టింగ్ కౌచ్ పై దేశ వ్యాప్తంగా పెద్ద పోరాట‌మే న‌డిచింది. అన్ని రంగాల్లో లైంగిక దాడులు జ‌రుగుతున్నాయ‌ని సాధార‌ణ మ‌హిళ‌లు సైతం ధైర్యంగా ముందుకొచ్చి త‌మ బాధ‌ని వెల్ల‌డించారు. తాజాగా మాజీ మిస్ ఇండియా .. అందాల క‌థానాయిక‌ ఈషా గుప్తా ఇదే అంశంపై బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ని ఉద్దేశించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు అవ‌కాశాలు పేరుతో త‌న‌ని వేధించిన‌ట్లు తెలిపింది.

``ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు రాత్రంతా త‌మ‌తో గ‌డ‌పాల‌ని వేధించారు. అలాగే ఓ కోప్రోడ్యూస‌ర్ కి లొంగ‌క‌పోవ‌డంతో ప్రాజెక్ట్ మ‌ధ్య‌లోంచి త‌ప్పించారు`` అని వాపోయింది. మ‌రో నిర్మాత ప‌నిగ‌ట్టుకుని ఔట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసి త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆరోపించింది. ఆ భ‌యంతోనే రాత్రిపూట తోడుగా ఓ మేక‌ప్ ఆర్టిస్ట్ ని త‌న‌తో రూమ్ లో ప‌డుకోమ‌ని అడిగేదాన్ని అని తెలిపింది. అదే ప‌రిశ్ర‌మ‌లో స్టార్ కిడ్స్ తో ఇలా ప్ర‌వ‌ర్తించే సాహ‌సం చేయ‌ర‌ని.. అలా చేస్తే వారి త‌ల్లిదండ్రులు చంపేస్తారు? అన్న భ‌యం ఉంటుంద‌ని అన్నారు.

ప‌రిశ్ర‌మ‌కి కొత్త‌గా వ‌చ్చిన వాళ్ల విష‌యంలో ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. అమ్మాయిలంటే కొంద‌రికి ఆట‌వ‌స్తువుల్లాగే చూస్తున్నార‌ని ఆవేద‌న చెందింది. బాలీవుడ్ లో స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణం క‌మిట్ మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఈషా గుప్తా అభిప్రాయ‌ప‌డింది. `జ‌న్న‌త్ -2`తో ఈషా గుప్తా బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత బోల్డ్ చిత్రాల్లో న‌టించి పాపుల‌ర్ అయింది. అందాల ఆర‌బోత‌లో ఈషా ఎప్ప‌టిక‌ప్ప‌డు సమ్ థింగ్ స్పెష‌ల్ గా నిలుస్తుంది. ఇక తెలుగులో రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `విన‌య విధేయ రామ` లో ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే.