Begin typing your search above and press return to search.

వింట‌ర్‌లో బికినీ మంట‌లు

By:  Tupaki Desk   |   6 Dec 2018 4:29 AM GMT
వింట‌ర్‌లో బికినీ మంట‌లు
X
చ‌లి పులి పంజా విసురుతోంది. సౌత్‌ లోనే స‌న్నివేశం ఇలా ఉందంటే, ఉత్తరాదిన సీనేంటో. అయితే ఎంత శీత‌ల వాతావ‌ర‌ణం ఉన్నా కుర్రాళ్లు మాత్రం వేడెక్కిపోతున్నారు. అంత‌గా మంట‌లు పెడుతోంది ఇషా గుప్తా. గ‌త కొంత‌ కాలంగా ఈ అమ్మ‌డు ఇన్‌ స్టాలో ఒక్కో హాట్ ఫోటోని అప్‌ లోడ్ చేస్తూ వేడి పుట్టిస్తోంది. చ‌లీ గిలీ జాన్తా న‌య్‌! అన్న తీరుగా ఉందీ వ్య‌వ‌హారం. బికినీ లుక్‌.. టూపీస్ లుక్ తో అగ్గి రాజేస్తోంది.

సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌ లో యూత్ ఎక్కువ‌గా ఇన్‌ స్టాగ్ర‌మ్‌, ట్విట్ట‌ర్‌ ల‌ను అనుస‌రిస్తున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీల్ని కోట్లాదిగా ఫాలోవ‌ర్స్ అనుస‌రిస్తూనే ఉన్నారు. ఆ క్ర‌మంలోనే ఇషా గుప్తా బికినీలు కుర్రాళ్ల సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి. తాజాగా ఇషా షేర్ చేసిన టోన్డ్ ఆయిల్డ్ బాడీ ఫోటో శ‌ర‌వేగంగా దూసుకుపోతోంది. హాలీవుడ్ హాటీస్‌ జెన్నిఫ‌ర్, లేడీ గాగా రేంజులో పాపుల‌రైపోతోంది ఇషా.

ఇప్ప‌టికిప్పుడు బాలీవుడ్‌లో ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తూ ఇత‌ర భామ‌ల‌కు కాంపిటీష‌న్ ఇస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ. ఎంద‌రు స్టార్ హీరోయిన్లు ఉన్నా త‌న‌కంటూ అక‌వాశాలు త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంది. ప్ర‌తిష్ఠాత్మ‌క `హేరాఫేరి` సీక్వెల్ సినిమాలో అవ‌కాశం అందుకున్న ఇషా గుప్తా.. మ‌రిన్ని భారీ ప్రాజెక్టుల్లోనూ న‌టిస్తోంది. ఈ సినిమాలు సెట్స్ లో ఉన్నాయి కాబ‌ట్టి ప‌బ్లిక్ అటెన్ష‌న్ త‌ననుంచి దూరంగా పోకుండా ఇలా ఇన్‌స్టాని వేడెక్కిస్తూ ఐడెంటిటీని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నమాట‌.