Begin typing your search above and press return to search.

బికినీలో అద‌రిపోయే అందాల‌తో ఇషాజీ

By:  Tupaki Desk   |   29 Sep 2021 8:30 AM GMT
బికినీలో అద‌రిపోయే అందాల‌తో ఇషాజీ
X
హాట్ ఫొటో ఫోటో షూట్ ల‌తో ఎలా పాపుల‌ర్ కావాలో హాట్ బ్యూటీ ఇషా గుప్తానే అడ‌గాలి. సీరియ‌ల్ కిస్స‌ర్ ఇమ్రాన్ హ‌ష్మీ న‌టించిన `జ‌న్న‌త్‌` మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇషా గుప్తా తొలి చిత్రంతోనే హాట్ హాట్ గా చెల‌రేగి రెబల్ హీరోయిన్ గా క్రేజ్ ని సొంతం చేసుకుంది. న‌ట‌న కంటే త‌న గ్లామ‌ర్ నే త‌న కెరీర్ కి మెయిన్‌ కీ ఫ్యాక్ట‌ర్ గా వాడుకుంటూ బాలీవుడ్ లో పాపుల‌ర్ అయిపోయింది.

హాట్ హీరోయిన్ గా బిగ్ స్క్రీన్‌పై రెచ్చిపోయి రొమాన్స్ చేసినా ఇషాకు పెద్ద‌గా గుర్తింపు రాలేదు కానీ ఆమె ఎక్స్ పోజింగ్‌ల‌కి మాత్రం హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. న‌టిగా కంటే హాట్ ఫొటో షూట్ ల‌తో యువ హృద‌యాల్ని కొల్ల‌గొట్టిన ఇషా చేతిలో ఇప్పుడు ఏ సినిమా లేదు. తెలుగులోనూ మెరిసిన ఇషాకు ఇక్క‌డ కూడా చుక్కెదురైంది.

విచిత్రం ఏంటంటే సినిమాలు లేక‌పోయినా ఇషా ఇన్ స్టాని హ‌టెక్కిస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా టూ పీస్ బికినీలో ఇషా షేర్ చేసిన ఫొటోలు ఆమె భారీ అందాల‌తో పిచ్చెక్కిస్తున్నాయి. ఓర కంటి చూపుల‌తో మ‌త్తెక్కించే ఒంపుల‌తో మంట‌పెడుతున్న ఇషా త‌న భారీ అందాల‌తో మ‌రెంత కాలం సోష‌ల్ మీడియాని త‌న గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుందో చూడాలి.