Begin typing your search above and press return to search.

గాల్లో తేలిపోతున్న ఈరోస్

By:  Tupaki Desk   |   16 Aug 2015 4:12 PM GMT
గాల్లో తేలిపోతున్న ఈరోస్
X
ఈరోస్ ఇంటర్నేషనల్.. ఈ పేరు చెబితే మొన్నటి వరకు సౌత్ ఇండియాలో సినీ జనాలు బెంబేలెత్తిపోయేవాళ్లు. ఆ సంస్థ వేలు పెట్టిందంటే చాలు.. ఆ సినిమా డిజాస్టరే అన్న ముద్ర పడిపోయింది. తెలుగులో ఆ సంస్థ పెట్టుబడి పెట్టిన 1 నేనొక్కడినే, ఆగడు సినిమాలు ఎలాంటి ఫలితాలు చూశాయో అందరికీ తెలిసిందే. మరోవైపు తమిళంలో కూడా లింగా లాంటి సినిమాలు ఈరోస్ వాళ్ల దుంప తెంచాయి. మరోవైపు బాలీవుడ్ సినిమాల విషయంలో గత ఏడాది ఈరోస్ వాళ్లకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఈరోస్ వాళ్ల పంట పండుతోంది. ప్రథమార్ధంలో ‘తను వెడ్స్ మను’ సినిమా వాళ్లకు పెట్టుబడి మీద రెండు మూడు రెట్ల లాభాలు తెచ్చి పెట్టింది.

ఇక సెకండాఫ్ లో అయితే ఈరోస్ వాళ్ల సుడి మామూలుగా లేదు. సల్మాన్ సినిమా ‘భజరంగి భాయిజాన్’ వాళ్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా రూ.600 కోట్ల వసూళ్లు సాధించి ఈరోస్ కు అతి పెద్ద హిట్టుగా నిలిచింది. బాలీవుడ్ లో మాత్రమే కాదు.. సౌత్ లో కూడా ఈ ఏడాది ఈరోస్ వాళ్ల సుడి తిరిగింది. దానికి శ్రీకారం చుట్టింది ‘శ్రీమంతుడు’ సినిమానే. ఈ సినిమాను ఈరోస్ రూ.70 కోట్లతో కొనుగోలు చేసింది. ఐతే ఆ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఫుల్ రన్ లో ఈరోస్ వాళ్లకు భారీ లాభాలు మిగల్చడం ఖాయం. ఈ ఏడాదంతా భారీ హిట్లతో సాగిపోతుండటంతో గత ఏడాదితో పోలిస్తే ఈరోస్ వాళ్ల ఆదాయంలో భారీ పెరుగుదల కనిపించింది. నిరుడు ఈరోస్ ఆదాయం రూ.242 కోట్లు కాగా.. ఈసారి అది రూ.472.48 కోట్లకు చేరుకుంంది. అంటే పెరుగుదల 95 శాతమన్నమాట.