Begin typing your search above and press return to search.

ఈసారి గట్టిగా కొట్టేస్తామనంటున్న ఈరోస్‌

By:  Tupaki Desk   |   6 Aug 2015 5:25 AM GMT
ఈసారి గట్టిగా కొట్టేస్తామనంటున్న ఈరోస్‌
X
ఈరోస్‌.. పెద్దగా పరిచయం అక్కర్లేని బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ వీరు. అయితే సౌత్‌ లో మాత్రం వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ బెడసి కొడుతున్నాయ్‌. డైరక్టు ప్రొడక్షన్‌ ఒక్కటి కూడా చేయలేదు కాని, వేరే నిర్మాతలు తీసిన సినిమాలను అవుట్‌ రేట్‌ కు కొనేయడం ఈరోస్‌ వారికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే వారు గతంలో రజనీకాంత్‌ లింగా, మహేష్‌ బాబు 1 నేనొక్కడినే, శ్రీమంతుడు సినిమాలను కొనేశారు. కాకపోతే ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే.

అటు రజనీ కాటు, ఇటు మహేష్‌ కాని ఎవ్వరూ ఈరోస్‌ వారిని ఆదుకుందే లేదు. ప్రతీసినిమానూ దాదాను 80 కోట్ల పైమాటకే ఈరోస్‌ కొనుక్కున్నా కూడా, వారికి మాత్రం పెద్దగా లాభాలేం రాలేదు. ఎందుకంటే వీళ్ళు కొనుక్కునేది కేవలం ప్రపంచవ్యాప్త ధియేట్రికల్‌ రైట్స్ మాత్రమే కాబట్టి, సినిమా ధియేటర్లలో ఆడితేనే వీరికి డబ్బలొచ్చేది. అయితే నష్టపోయేది ఊళ్ళలో సినిమాను కొనుక్కున్న పంపిణీదారుడు కావొచ్చుకాని, అక్కడక్కడా ఈరోస్‌ వారికి కూడా నష్టం తప్పదు. కాని ఈసారి శ్రీమంతుడు విషయంలో మాత్రం వారికి సినిమాను చూపించే అమ్మారట మైత్రి మూవీస్‌ మరియు మహేష్‌ బాబు. ఈసారి మాత్రం మిస్‌ అవ్వకుండా గట్టిగా కొట్టేస్తాం అంటున్నారు అందుకే.

రేపు రిలీజ్‌ అవుతున్న శ్రీమంతుడు సినిమా ఈసారి ఈరోస్‌ వాళ్ళకు భారీ లాభాలను మిగల్చాలనే ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. కొరటాల శివ డైరక్షన్‌ లో రూపొందిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్‌, సుకన్య కీలకపాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్‌ శృతిహాసన్‌ ఒక అద్భుత పాత్ర పోషిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చాడు.