Begin typing your search above and press return to search.

`థాంక్యూ` నుంచి సెకండ్ సింగిల్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   16 Jun 2022 1:05 PM GMT
`థాంక్యూ` నుంచి సెకండ్ సింగిల్ వ‌చ్చేసింది
X
అక్కినేని నాగ‌చైత‌న్య హ్యాట్రిక్ హిట్ కి రెడీ అయిపోతున్నారు. గ‌త ఏడాది సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్ లో ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ `ల‌వ్ స్టోరీ` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఫాద‌ర్ నాగార్జున తో క‌లిసి చేసిన చిత్రం `బంగార్రాజు`. జ‌న‌వ‌రిలో సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ మూవీ చైకి భారీ విజ‌యాన్ని అందించ‌లేక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించింది.

ఇదే ఊపులో ముచ్చ‌ట‌గా మూడ‌వ సినిమాతో హాట్రిక్ హిట్ కి రెడీ అయిపోయాడు నాగ‌చైత‌న్య‌. త‌ను న‌టిస్తున్న తాజా మూవీ `థాంక్యూ`. `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించాను. రాశిఖ‌న్నా, మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్ లుగా న‌టించారు. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ జూలై 8న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ యాక్టివీటీస్ ని మొద‌లు పెట్టారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా హీరో నాగచైత‌న్య ఇందులో హాకీ ప్లేయ‌ర్ గా, సూప‌ర్ స్టార్ మ‌హేష్ వీరాభిమానిగా క‌నిపించ‌బోతున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ మూవీపై భారీగానే అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం లిరిక‌ల్ వీడియోల‌ని విడుద‌ల చేస్తూ వ‌స్తోంది.

ఇప్ప‌టికే `మారో మారో..` అంటూ విడుద‌ల చేసిన‌ ఫ‌స్ట్ సింగిల్ కు విశేష స్పంద‌న ల‌భించింది. తాజాగా `ఏంటో ఏంటేంటో..` అంటూ సాగే సెకండ్ సింగిల్ లిరిక‌ల్ వీడియోని గురువారం విడుద‌ల చేశారు. త‌మ‌న్ సంగీతం అందించారు. అనంత శ్రీ‌రామ్ సాహిత్యం అందించ‌గా జోనితా గాంధీ ఆల‌పించారు. మెలోడీ ప్ర‌ధానంగా సాగే ఈ పాట సంగీత ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మూడు ద‌శ‌ల్లో సాగే హీరో జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ ప్రేమ‌క‌థ‌ని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. ఒక్కో ద‌శ‌లో ఒక్కో హీరోయిన్ వుంటుంది కాబ‌ట్టి ఈ మూవీలో చైకి జోడీగా ముగ్గురు హీరోయిన్ లు న‌టించిన‌ట్టుగా తెలుస్తోంది.

తాజాగా రిలీజ్ చేసిన లిరిక‌ల్ వీడియోలో నాగ‌చైత‌న్య యంగ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. అంతే కాకుండా అత‌నికి జోడీగా మాళవిక నాయ‌ర్ క‌నిపించింది. ఇదిలా వుంటే రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి సంగీతం త‌మ‌న్‌, ఛాయాగ్ర‌హ‌ణం పీసీ శ్రీ‌రామ్‌, ఎడిటింగ్ న‌వీన్ నూలి.