Begin typing your search above and press return to search.

ఎంత మంచివాడవురా లోగో టీజర్ మంచిగా ఉందే

By:  Tupaki Desk   |   5 July 2019 8:21 AM GMT
ఎంత మంచివాడవురా లోగో టీజర్ మంచిగా ఉందే
X
ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్-సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం టైటిల్ ను ప్రకటించారు. 'ఎంత మంచివాడవురా' అనేది టైటిల్. అయితే జస్ట్ టైటిల్ లోగో పోస్టర్ మాత్రమే విడుదల చేసి సరిపెట్టుకోకుండా టైటిల్ లోగోకు ఒక టీజర్ ను విడుదల చేశారు.

జోరుగా కురుస్తున్న వాన.. చెట్ల ఆకులపైనుంచి.. చిన్న హోటల్ రేకులపైనుంచి ధారగా కారుతున్న నీటితో స్టార్ట్ అయింది టీజర్. "బాబాయ్ ఓ టీ" అంటూ ఒక కస్టమర్ వచ్చి కూర్చుంటాడు. ఇంతలో రేడియోలో వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో "ఎంత మంచివాడవురా.. ఎన్ని నోళ్ళ పొగడుదురా" అనే పాత పాట ప్లే అవుతూ ఉంటుంది. ఈ షాపు లోనే మల్టిప్లెక్సుల్లోని స్వీటు కార్న్ కు పూర్తి వ్యతిరేకంగా ఉండే నాటు కార్న్ ను బొగ్గులపై కాలుస్తూ ఉంటారు. ఇక ఈ కాలుస్తున్న మొక్కజొన్నను చూసి ఎదురుగా చెట్టుకింద ఉండే ఇద్దరు పిల్లలకు నోరూరుతుంది. కొనుక్కుని తినాలని చూస్తే సరిపడా డబ్బు ఉండదు. ఆ సమయంలో కళ్యాణ్ రామ్ రెండు మొక్కజొన్న కండెలను కొని.. ఆ పిల్లల చేతిలో పెడతాడు. వారి ఫేస్ లో ఫుల్లుగా ఆనందం కనిపిస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ గొడుగు వేసుకొని సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతాడు.

టైటిల్ కి తగ్గట్టు కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మంచిమనసున్న మనిషి పాత్రలో నటిస్తున్నాడని అర్థం అవుతుంది. ఈ సినిమా ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపిసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ సినిమా మెజారిటీ షూటింగ్ రాజమండ్రిలోనూ.. హైదరాబాద్ లోనూ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. రెగ్యులర్ షూటింగ్ జులై 24 నుండి ప్రారంభిస్తారట.