Begin typing your search above and press return to search.
అలరిస్తోన్న 'పొగరు' డైలాగ్ ట్రైలర్..!
By: Tupaki Desk | 1 Jan 2021 1:17 PM IST'యాక్షన్ కింగ్' అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ''పొగరు''. నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీని శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్ పై బి.కె. గంగాధర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డి. ప్రతాప్ రాజు విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన 'కరాబు' సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా 'పొగరు' డైలాగ్ ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'అడ్రెస్ కనుక్కుని సర్వీస్ చేయడానికి కొరియర్ బాయ్ ని అనుకున్నార్రా.. ఫైటర్.. కొడితే ఎవడి అడ్రెస్ అయినా గల్లంతవ్వాల్సిందేరా..' అంటూ ధ్రువ సర్జా చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ధృవ సర్జా మాస్ లుక్ లో కనిపిస్తుండగా.. రష్మిక ఇన్నోసెంట్ అమ్మాయిగా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలో మరో ట్రైలర్ తో రాబోతున్నామని ఈ డైలాగ్ ట్రైలర్ లో పేర్కొన్నారు. ఇకపోతే ఈ చిత్రానికి పాపులర్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి సాంగ్స్ అందించారు. ఎస్.డి. విజయ్ మిల్టన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. కె.ఎం. ప్రకాష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో సంపత్ రాజ్ - ధనంజయ్ - రవిశంకర్ - పవిత్రా లోకేష్ - గిరిజా లోకేష్ తో పాటు 'డబ్ల్యుడబ్ల్యుఈ' స్టార్లు కై గ్రీన్ - మోర్గాన్ ఆస్టే - జో లిండ్నర్ - జాన్ లూకాస్ కూడా నటిస్తున్నారు. త్వరలో తెలుగులో రిలీజ్ కానున్న కన్నడ డబ్బింగ్ మూవీ 'పొగరు' ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.