Begin typing your search above and press return to search.

అలరిస్తోన్న 'బూట్ కట్ బాలరాజు' బర్త్ డే గ్లింప్స్..!

By:  Tupaki Desk   |   18 April 2022 10:47 AM GMT
అలరిస్తోన్న బూట్ కట్ బాలరాజు బర్త్ డే గ్లింప్స్..!
X
బిగ్ బాస్ తెలుగు సీజన్-4 రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సయ్యద్ సోహైల్ రియాన్. కథ వేరేలా ఉంటది అంటూ తన ప్రవర్తన, ఆటతీరుతో అందరి అభిమానాన్ని చూరగొన్న ఈ సింగరేణి యువకుడు.. హౌస్ నుంచి బయటకొచ్చాక 'మిస్టర్ ప్రెగ్నెంట్' & 'బూట్ కట్ బాలరాజు' అనే ఆసక్తికరమైన టైటిల్స్ తో హీరోగా రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి.

లక్కీ మీడియా - గ్లోబల్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న 'బూట్ కట్ బాలరాజు' చిత్రానికి కోనేటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 'మల్లేశం' 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. నేడు హీరో సోహైల్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 'బూట్ కట్ బాలరాజు' చిత్ర బృందం ఓ స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది.

'రింగా రింగా రింగా బిళ్ళా.. రూపాయి రూపాయి దండా..' అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చిన ఈ గ్లిమ్స్.. సినిమాలో హీరో పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగా సొహైల్ బూట్ కట్ ప్యాంట్స్ తో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతని డైలాగ్ డెలివరీ - యాటిట్యూడ్ యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ వీడియో చివర్లో 'ఊరికి ఒక మంచి పనైనా చేసినవా రా?' అని వ్యక్తి అడగ్గా.. ''ఎందుకు చేయలే.. మొన్న రాత్రి ఒకడు స్టాండ్ తీయకుండా బైక్ మీద పోతాంటే 'స్టాండ్ స్టాండ్' అని అరిసినా.. అది మంచి పని కాదా?'' అని సోహైల్ చెప్పే విధానం నవ్వు తెప్పిస్తుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'బూట్ కట్ బాలరాజు' సినిమాలో యాక్షన్ పాళ్లు కూడా ఉన్నట్లు ఈ గ్లిమ్స్ ని బట్టి అర్థం అవుతుంది.

గతంలో కొన్ని సినిమాలలో చిన్న సైడ్ క్యారెక్టర్స్ పోషించిన సోహైల్ రియాన్.. హీరోగా ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇందులో ఇంద్రజ - వెన్నెల కిషోర్ - బ్రహ్మాజీ - ఆనంద్ చక్రపాణి - ఝాన్సి - ముక్కు అవినాష్ - జబర్దస్త్ రోహిణి - మాస్టర్ రామ్ తేజస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

బెక్కం బబిత సమర్పిస్తున్న 'బూట్ కట్ బాలరాజు' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.