Begin typing your search above and press return to search.
సాంగ్ టాక్: చైతూ టైమింగ్ తో కొట్టాడు
By: Tupaki Desk | 7 Aug 2017 6:10 AM GMTఈ రోజు రాఖీ పౌర్ణమి. ఈ సందర్భంగా థియేటర్లలో ఉన్న సినిమాలు.. మేకింగ్ లో ఉన్న సినిమాల తరఫున ప్రేక్షకులకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. కానీ వాటన్నింట్లోకి బెస్ట్ విషెస్ మాత్రం ‘యుద్ధం శరణం’ టీం నుంచే వచ్చాయని చెప్పాలి. రాఖీని పురస్కరించుకుని ఒక హార్ట్ టచింగ్ సాంగ్ తో వచ్చింది ఈ చిత్ర బృందం. ఆ పాటకు రాఖీ పౌర్ణమితో లింక్.. ఈ పాటను సరైన టైమింగ్ లో రిలీజ్ చేయడం వల్ల దీనికి ప్రత్యేకత చేకూరింది.
‘యుద్ధం శరణం’ ఫ్యామిలీ డ్రామా.. రివెంజ్ నేపథ్యంలో సాగే సినిమా. ఇందులో చైతూకు ఓ అందమైన కుటుంబం ఉంటుంది. అతడికి అక్క.. చెల్లి ఉంటారు. వాళ్లిద్దరూ అతడికి రాఖీ కట్టడంతో మొదలవుతుంది ‘ఎన్నో ఎన్నో భావాలే.. పెనవేసే ఎదలో రాగాలే..’ అనే పాట. సిస్టర్స్ ఇద్దరూ చైతూకు రాఖీ కట్టాక.. తల్లి రేవతి.. ‘‘రాఖీ ఎందుకు కడతారో తెలుసా? అమ్మా నాన్నల తర్వాత అక్క చెల్లెల్ల బాధ్యత అన్నదమ్ములదే అని అని ప్రతి నిమిషం గుర్తు చేయడానికి’’ అంటూ హార్ట్ టచింగ్ మాటలు చెబుతుంది.
ఇక ఆ తర్వాత.. ‘‘ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే.. ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే.. పులకించే.. బంధాలన్నీ ఒకటై.. ఆలకించే.. ఆనందాల పాటే..’’ అంటూ ఆహ్లాదంగా సాగిపోతుందీ పాట. ‘పెళ్లిచూపులు’తో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన యువ సంగీత తరంగం వివేక్ సాగర్.. ‘యుద్ధం శరణం’లో తొలి పాటతోనే ఆకట్టుకున్నాడు. మంచి ట్యూన్.. అర్థవంతమైన లిరిక్స్.. శ్రావ్యమైన గానం.. ఇలా అన్నీ కుదిరి ‘ఎన్నో ఎన్నో భావాలే..’ పాట ఇన్ స్టంట్ గా నచ్చేసేలా ఉంది. విజువల్స్ కూడా ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి. మొత్తానికి ‘యుద్ధం శరణం’ మీద ఇప్పటికే ఉన్న పాజిటివ్ బజ్ ను పెంచేలా ఉందీ పాట.