Begin typing your search above and press return to search.
'బిట్ కాయిన్' ఫర్ డ్రగ్స్..!
By: Tupaki Desk | 2 Sept 2021 3:00 PM ISTటాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు చూపిస్తోంది. నాలుగేళ్ళ క్రితం నాటి సంచలన కేసులో రంగంలో దిగిన ఈడీ.. విచారణ వేగవంతం చేసింది. మాధకద్రవ్యాల వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో పలువురికి నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకే ఈ కేసు ముందుకు నడుస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను విచారించగా.. ఈరోజు శుక్రవారం హీరోయిన్ ఛార్మీ కౌర్ ని ఈడీ ప్రశ్నిస్తోంది.
డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల ఆధారంగా నిందితుడుగా ఉన్న కెల్విన్ పై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి గత 6 నెలలుగా విచారిస్తున్నారు. డార్క్ వెబ్ తో డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చి ఇంటర్నెట్ ద్వారా చెల్లింపులు జరిపినట్టు ఈడీ గుర్తించింది. ఈ చెల్లింపులు ఎక్కువగా బిట్ కాయిన్ రూపంలో జరిగాయని తెలుస్తోంది. బిట్ కాయిన్ అనేది ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు.. కరెన్సీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని వర్చువల్ కరెన్సీ అనొచ్చు.
భారత కరెన్సీలో చూసుకుంటే ఒక్క బిట్ కాయిన్ విలువ దాదాపు 35 లక్షల వరకూ ఉంటుంది. బిట్ కాయిన్ ల ద్వారా జరిగే ఆర్ధిక లావాదేవీలు అత్యంత గోప్యంగా ఉంటాయి. ఎవరెవరికి బిట్ కాయిన్లను పంపుతున్నారో థర్డ్ పర్సన్ కి ఆ వివరాలు తెలిసే అవకాశం ఉండదు. బిట్ కాయిన్ ఏ దేశానికి చెందిన ప్రభుత్వం, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ఆధీనంలో ఉండవు కాబట్టి.. దీని మీద ఎలాంటి ట్యాక్సులు విధించలేరు. బిట్ కాయిన్ల లావాదేవీలు ప్రత్యేకమైన ఎక్స్‌ఛేంజ్ సంస్థలు ద్వారా జరుగుతాయి. అందుకే బిట్ కాయిన్ ను ఎక్కువగా ఇల్లీగల్ కార్యకలాపాలకు ఉపయోస్తున్నారు.
ఇప్పుడు డ్రగ్స్ క్రయవిక్రయాలు కూడా బిట్ కాయిన్ల రూపంలోనే జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో మనీలాండరింగ్ జరిగిందనే అన్ని కోణాల్లో ఈడీ విచారణ చేయనుంది. ఈరోజు ఎంక్వైరీలో భాగంగా ఛార్మి బ్యాంక్ ఖాతాలను ఈడీ పరిశీలిస్తోంది. కెల్విన్ అకౌంట్ లోకి ఛార్మి మనీ ట్రాన్స్ఫర్ చేసిందా లేదా? అన్న కోణంలోనూ ఈడీ విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ - ఛార్మి కలిసి సినిమాలు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇద్దరి ఆర్ధిక లావాదేవీల గురించి ఆరా తీసే అవకాశం ఉంది.