Begin typing your search above and press return to search.

ఉస్తాద్ మెడకు గాయం.. RAPO19 షూటింగ్ వాయిదా..!

By:  Tupaki Desk   |   4 Oct 2021 8:35 AM GMT
ఉస్తాద్ మెడకు గాయం.. RAPO19 షూటింగ్ వాయిదా..!
X
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తుండగా రామ్ కు స్వల్ప గాయమైంది.

#RAPO19 సినిమాలో తన పాత్రకు అవసరమైన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి రామ్ జిమ్ లో హార్డ్ వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ మెడకు గాయం అయినట్టు తెలుస్తోంది. తాజాగా యువ హీరో తన మెడకు సర్వికల్ నెక్ పిల్లో చుట్టి ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి #RAPO హ్యాష్ ట్యాగ్ జోడించి "టేక్ ఏ బ్రేక్ ఆర్ టేక్ ది బ్రేక్" అని క్యాప్షన్ పెట్టాడు.

గాయంతో ఉన్న రామ్ ని చూసిన అభిమానులు కలవరపడ్డారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. త్వరలోనే రామ్ ఫుల్ ఎనర్జీతో తిరిగి వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే రామ్ మెడకు స్వల్పగాయం కావడంతో సినిమా షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. రామ్ పూర్తిగా కోలుకున్నాక తిరిగి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.

కాగా, #RAPO ను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. ఇది లింగుసామికి ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఈ చిత్రంతో రామ్ తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకురుస్తున్నారు. సుజీత్ వాసుదేవ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి అన్బు-అరివు ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో RAPO19 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.