Begin typing your search above and press return to search.

అలరిస్తోన్న 'ఎనిమీ' వెడ్డింగ్ సాంగ్..!

By:  Tupaki Desk   |   3 Sep 2021 2:02 PM GMT
అలరిస్తోన్న ఎనిమీ వెడ్డింగ్ సాంగ్..!
X
కోలీవుడ్ స్టార్ హీరోలు విశాల్ - ఆర్య పదేళ్ల తర్వాత కలిసి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎనిమీ''. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన టీజర్ - 'పడదే' సాంగ్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'టం టం' అనే సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు.

'మనసే ఇప్పుడిప్పుడే వింటుంది.. మామ గుండెల్లో మద్దెల టం టం.. సిరి పోరికి మెల్లంగా తెలిసింది.. ఆశ పెంచిన అక్షత టం టం..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ థీమ్ తో చిత్రీకరించబడిన ఈ సాంగ్ కి ఎస్ ఎస్ థమన్ బాణీలు సమకూర్చారు. గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఈ గీతానికి సాహిత్యం అందించగా.. అదితి - సత్య వాహిని - తేజస్విని కలిసి ఆలపించారు. ఈ సాంగ్ కు బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో విశాల్ - మృణాళిని సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. విజువల్ గా కూడా ఈ సాంగ్ గ్రాండియర్ గా ఉంది.

'ఎనిమీ' చిత్రాన్ని మినీ స్టూడియోస్‌ పతాకంపై ఎస్. వినోద్‌ కుమార్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆర్‌డి రాజశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రేమాండ్ డేర్రిక్ ఎడిటింగ్ వర్క్ చేశారు. థమన్ సంగీతం సమకూర్చగా.. శ్యామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ప్రకాష్‌ రాజ్‌ - మమతా మోహన్ దాస్ - తంబి రామయ్య - కరుణాకరన్ ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.