Begin typing your search above and press return to search.
ఫ్యాషన్ ఇండస్ట్రీలో 'సర్కులర్ ఎకానమీ'ని ఎంకరేజ్ చేయండి: అనుష్కశర్మ
By: Tupaki Desk | 30 Jun 2021 8:00 AM ISTబాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అనుష్క శర్మ.. మంచి ప్రయోజనం కోసం డబ్బును సేకరించడానికి తన ప్రెగ్నెన్సీ(మెటర్నిటీ) దుస్తులను వేలం వేయనుంది. ఆన్‌లైన్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ఓ తల్లి ఆరోగ్యానికి తోడ్పడుతుందని.. అలాగే 2.5 లక్షల లీటర్ల నీటిని ఆదా చేస్తుందని ఆమె తెలిపింది. ఫ్యాషన్ వ్యవస్థలో 'సర్కులర్ ఎకానమీ'ని వెంటనే ప్రారంభం చేయాలని ఆమె భావిస్తున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది. అనుష్క మాట్లాడుతూ.. "ఈ పద్ధతి మనలో ప్రతి ఒక్కరూ మంచి జీవితాలను గడపడానికి చాలా సులభమైన మార్గం. సర్కులర్ ఫ్యాషన్ వ్యవస్థలో అందరూ భాగస్వామ్యం అవ్వడం ద్వారా ప్రీలావ్డ్ షాపింగ్ చేయడంతో పాటు పర్యావరణం పై మనకు చాలా సానుకూల వాతావరణం నెలకొంటుంది.” అని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ఈ ఆలోచన తన కూతురు వామిక గర్భంలో ఉన్నప్పుడే వచ్చిందని అంటోంది. దీనిపై అనుష్క మరింత మాట్లాడుతూ.. "ఇండియాలోని పట్టణ ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలు కేవలం ఒక శాతం మంది కొత్తగా తయారైన వాటి కంటే ముందస్తు ప్రెగ్నెన్సీ దుస్తులను కొనుగోలు చేస్తే.. ప్రతి సంవత్సరం 200 సంవత్సరాలకు పైగా ఒక వ్యక్తి త్రాగేంత నీరు మనం ఈజీగా ఆదా చేయవచ్చు. ఇది ప్రతి వ్యక్తి చేస్తే చిన్నచర్యే కానీ నిజమైన తేడాను మనం చూడవచ్చు" అంటూ చెప్పుకొచ్చింది.
అనుష్క - కోహ్లీ తమ మొదటి బిడ్డ వామికను ఈ ఏడాది జనవరి 11న స్వాగతించారు. ఈ జంట ముంబైలోని మీడియా మిత్రులకు ఒక నోట్ కూడా రాశారు. మా కూతురు వామిక గోప్యతను గౌరవించాలని కోరారు. తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ.. శర్మ - కోహ్లీ తమపై చూపిన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అందులో పేర్కొన్నారు. "ఓ కూతురు తల్లిదండ్రులుగా.. మీకు విన్నవించుకునే ఒక సాధారణ అభ్యర్థన ఉంది. మా కూతురు గోప్యతను కాపాడాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఎల్లప్పుడూ మీ సహాయం - మద్దతుమాకు ఉండాలని కోరుతున్నాం" అని ఈ జంట ఒక ప్రకటనలో తెలిపింది. సరైన సమయం వచ్చినప్పుడు మేమే స్వయంగా మా కూతురు విషయాలు ఫోటోలు బయట పెడతామని ఈ కపుల్ తెలిపారు.