Begin typing your search above and press return to search.

గౌతమ్ మళ్ళీ అదే సాహసం చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   28 Nov 2016 4:45 AM GMT
గౌతమ్ మళ్ళీ అదే సాహసం చేస్తున్నాడా?
X
ప్రేమకధలలో యాక్షన్ జొప్పించడం ఒకింత కష్టమైన పనే. కాస్త అటు ఇటు అయితే మొదటికే మోసం వస్తుందని చాలామంది దర్శకులు అటువైపు అడుగులు వేయరు. అయితే ఇటీవల గౌతమ్ మీనన్ అటువంటి జోనర్ లో ఒక కొత్త ప్రయోగం చేసి సాహసమే శ్వాసగాసాగిపో చిత్రాన్ని తెరకెక్కించాడు. అవుట్ ఫుట్ సూపర్బ్ అనిపించకపోయినా ఎటెంప్ట్ ని మాత్రం అందరూ ప్రశంసించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మీనన్ తన కొత్త చిత్రాన్ని సైతం ఇలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట. ధనుష్ హీరోగా నటిస్తున్న 'ఎన్నై నొక్కి పాయమ్ తొట్ట' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని నిన్న ట్విట్టర్ లో విడుదలచేశాడు. కొన్ని పోస్టర్ లలో గెడ్డంతో రఫ్ లుక్ లో కనిపించిన ధనుష్ మరికొన్ని పోస్టర్లలో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ అలరించాడు. మేఘా ఆకాశ్ హీరోయిన్.

ఈ సినిమాకు సంబంధిచినంతవరకూ ప్రతీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు గౌతమ్ ప్రత్యేకంగా తెలుపడం విశేషం. ధనుష్ కి రఘువరన్, ధర్మయోగిలతో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడిన నేపథ్యంలో ఏకకాలంలో రెండు భాషలలో విడుదలచేసే అవకాశం వుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/