Begin typing your search above and press return to search.

అవి ఉన్నాయనే 'అజార్' చేశా

By:  Tupaki Desk   |   19 May 2016 11:00 AM IST
అవి ఉన్నాయనే అజార్ చేశా
X
మహమ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్రపై తీసిన సినిమా 'అజార్'. రిలీజ్ కు, తర్వాత వచ్చే లీగల్ ఇబ్బందులకు భయపడి.. ఈ చిత్రంలో పాత్రలు కల్పితం, ఎవరినీ ఉద్దేశించినవు కాదు అని కార్డ్ వేశారు కానీ.. ఇది టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ జీవిత చరిత్రపై రాసుకున్న స్టోరీ అనడంలో ఎలాంటి సందేహం ఎవరికీ లేదు. మరి ఓ మనిషి, అందులోనూ ప్రస్తుతం జీవించి ఉన్న వ్యక్తి బయోపిక్ చేయడమంటే సాహసమే, అందుకు చాలానే ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది.

అజార్ పాత్రను చేసేందుకు నాలుగు నెలల పాటు క్రికెట్ నేర్చుకున్నాడట సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ. ఆయనే స్వయంగా తన స్టైల్ బ్యాటింగ్ ను నేర్పించడంతో సులువైందని అంటున్నాడు. ఈ సినిమా ఒప్పుకోవడానికి కూడా అసలు కారణాలు చెప్పాడు ఇమ్రాన్. 'అజారుద్దీన్ జీవితంలో ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయని తెలుసు. వ్యక్తిగత జీవితం - ప్రొఫెషనల్ లైఫ్ కూడా వివాదాలు ఎదుర్కున్నవే. ఇవే నన్ను ఆకర్షించాయి. సినిమాకి ఇవి హెల్ప్ అవుతాయని భావించడంతోనే అజార్ చిత్రంలో నటించా' అని చెప్పాడు ఇమ్రాన్ హష్మి.

ఇమ్రాన్ హష్మి-నర్గీస్ ఫక్రీల లిప్ లాక్ సీన్ పై కూడా వివాదం ఉంది. ఇమ్రాన్ కి తగిలించిన ఆర్టిఫిషియల్ మీసాన్ని.. ఎక్కడి నుంచో తొలగించిన జుట్టుతో చేశారని నర్గీస్ చేసిన కామెంట్ పై కూడా ఇమ్రాన్ స్పందించాడు. అది షూటింగ్ సమయంలో సెట్స్ లో పేలిన ఒక జోక్ అని, బయటకు ఎందుకొచ్చిందో తెలియదని చెప్పిన ఈ హీరో.. తన కొడుకు కూడా కాబోయే క్రికెటర్ అని తెగ సంబరపడిపోతున్నాడు.