Begin typing your search above and press return to search.

'ఆహా' అనిపించేంత‌గా ఓటీటీని గెలిపించారా?

By:  Tupaki Desk   |   29 Nov 2020 7:00 PM IST
ఆహా అనిపించేంత‌గా ఓటీటీని గెలిపించారా?
X
డిజిట‌ల్ హ‌వా సాగుతున్న నేటి ట్రెండ్ లో అంత‌ర్జాతీయ స్థాయి కార్పొరెట్ దిగ్గ‌జాల పోటీ న‌డుమ `ఆహా - తెలుగు` పుట్టుక గురించి తెలిసిందే. అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ - డిస్నీ హాట్ స్టార్- ఈరోస్ లాంటి బ‌డా సంస్థ‌లు ఓటీటీ రంగంలో వేళ్లూనుకుని ఉన్నా బాస్ అల్లు అర‌వింద్ ఎంతో సాహ‌సంతో `ఆహా-తెలుగు`ను ప్రారంభించారు. ఆరంభం త‌డ‌బ‌డినా ఈ లాక్ డౌన్ సీజ‌న్ లో ఆహాకు భారీగా స‌బ్ స్క్రిప్ష‌న్లు ద‌క్కాయి.

ఓవైపు థియేట‌ర్ మూత‌పడితే ఓటీటీ వినోదం పుంజుకుంది. దీంతో పాటే ఆహా కూడా పుంజుకుని తెలుగు సినీప్రియుల‌కు చ‌క్క‌ని వినోద మాధ్య‌మంగా అవ‌త‌రించింది. అయితే దీనికోసం అర‌వింద్ చేసింది త‌క్కువేమీ కాదు.

ఒకానొక సంద‌ర్భంలో స‌బ్ స్క్రిప్ష‌న్స్ లో వెన‌క‌బ‌డితే బూస్టింగ్ కోసం కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డుల్ని వెద‌జల్లి ఒరిజిన‌ల్ కంటెంట్ సృష్టికి ప్ర‌య‌త్నించారు. అలా ఎంద‌రికో ఉపాధి కూడా పెరిగింది. క‌రోనా క్రైసిస్ కాలంలో ఇండ‌స్ట్రీలో ఉపాధి లేని ఆర్టిస్టులు టెక్నీషియ‌న్ల‌కు ఇదో చ‌క్క‌ని జీవ‌నోపాధి ఆధారంగా మారడంపై ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

ఆరంభం ఆహా స‌క్సెస‌వుతుందా? అంటూ ప‌లువురు సందేహించారు. కానీ స‌క్సెస్ చేసేందుకు అర‌వింద్ ర‌క‌ర‌కాల వ్యూహాల‌తో ముందుకొచ్చారు. ఎట్ట‌కేల‌కు ఈ తెలుగు ఓటీటీ అంద‌రికీ చేరువ‌వుతూ లాభాల బాట‌లోకి వెళుతోంద‌న్న ధీమా అల్లు కాంపౌండ్ నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆహాలో తెలుగు కంటెంట్ కు ప్రాధాన్యతనిచ్చి స‌క్సెస్ చేయ‌డం గొప్ప‌త‌న‌మే. ఈ నిర్భంధ స‌మ‌యంలో ఆహా ఎన్నో కొత్త సినిమాలు.. కంటెంట్ తో ముందుకొచ్చింది. ఇటీవ‌ల ఒరేయ్ బుజ్జిగా- క‌ల‌ర్‌ ఫోటో- భానుమ‌తి రామ‌కృష్ణ‌- జోహార్ లాంటి ఒరిజిన‌ల్ తెలుగు సినిమాల్ని ఆహాలో అందించారు. సుదీర్ఘ అనుభ‌వం అభిరుచి గ‌ల నిర్మాత‌గా ఆహా కంటెంట్ ని ఎంతో ప‌ర్ఫెక్ట్ ప్లానింగ్ తో డిజైన్ చేయ‌డంలో అల్లు బాస్ కృషికి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

ఓవైపు ఓటీటీ.. మ‌రోవైపు పెద్ద తెర కోసం ఆయ‌న ప‌ర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళుతున్నారు. అఖిల్ అక్కినేని `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` .. కార్తికేయ `చావు కబురు చల్లగా`.. నిఖిల్ `18 పేజెస్`.. అల్లు శిరీష్ సినిమా.. వరుణ్ తేజ్ సినిమా..ఇవ‌న్నీ అర‌వింద్ సార‌థ్యంలో జీఏ 2 సంస్థ‌లో తెర‌కెక్కుతున్నాయి. రెండు ప‌డ‌వ‌ల్ని స‌జావుగా న‌డిపించ‌డంలో ఆయ‌న అనుభ‌వం అక్క‌ర‌కొస్తోంది. ఓవ‌రాల్ గా ఎంతో ఛాలెంజింగ్ గా చేప‌ట్టిన ఆహాను స‌క్సెస్ చేసుకుని అర‌వింద్ సాటి ఎంట‌ర్ ప్రెన్యూర్స్ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నార‌నే చెప్పాలి.