Begin typing your search above and press return to search.

మాటలకు అందని విషాదం.. ఫర్ ఎవర్ సూపర్ స్టార్..!

By:  Tupaki Desk   |   15 Nov 2022 5:17 AM GMT
మాటలకు అందని విషాదం.. ఫర్ ఎవర్ సూపర్ స్టార్..!
X
నట శేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమలో విషాద చాయలు అలముకున్నాయి. నటుడిగా ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసిన కృష్ణ సాహసానికి మారు పేరుగా ఉండేవారు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉండేలా చేసుకున్నారు. నటిడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కృష్ణ చేసిన సినిమాలు పరిశ్రమ ఎదుగుదలకు ఎంతో సహకరించాయి. కృష్ణ మరణ వార్త విన్న సినీ ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులంతా తమ ఆవేదనని వెళ్లడిస్తున్నారు.

మాటలకు అందని విషాదం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కృష్ణ గారు మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం.. సాహసానికి ఊపిరి.. ధైర్యానికి పర్యాయపదం.. మానవత్వం.. మంచితనం కలబోత కృష్ణ గారు అని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమలోనే ఆయన అరుదైన మనిషని.. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. నా సోదరుడు మహేష్ బాబుకు.. ఆయన కుటుమ సభ్యులందరికీ.. అసంఖ్యాకమైన ఆయన అభిమానులకు నా ప్రగాడ సంతాపం, సానుభూతి తెలియచేసుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

కృష్ణ గారు అంటే సాహసానికి మరోపేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు.. విలక్షణమైన పాత్రలే కాకుండా సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలను పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికీ చిరస్మరణీయం.. మై థాట్స్ ఆర్ విత్ మహేష్ అన్న అండ్ ఫామిలీ.. ఓ శాంతి సూపర్ స్టార్ ఫర్ ఎవర్ అంటూ ఎన్.టి.ఆర్ ట్వీట్ చేశారు.

కృష్ణ గారు తుదిశ్వాస విడిచారనే విషయం తనకెంతో ఆవేదన కలిగించిందని అన్నారు పవన్ కళ్యాణ్. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. కౌ బోయ్, జేమ్స్ బాండ్ కథలతో కొత్త అనుభూతి కలిగించారు. ఎంపీ గా ప్రజా జీవితంలోనూ తనదైన ముద్ర వేశారు. కృష్ణ గారి మరణం తెలుగు సినిమాకు తీరని లోటు అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా నిర్మాతల హీరోగా నట శేఖరుడిగా సూపర్ స్టార్ గా పిలిపించుకున్న నటులు మాజీ ఎంపీ కృష్ణ గారి మరణ దిగ్బ్రాంతికి గురి చేసింది. నటుడిగా దర్శకుడిగా తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణ గారిని చెప్పుకుంటారు. కృష్ణ గారి మరణంతో అద్భుత సినీ శకం ముగిసినట్టు అయ్యింది. ఇటీవలే తల్లిని ఇప్పుడు తండ్రిని కోల్పోయిన మహేష్ బాబుకి ఇది తీరని వేదన. ఈ బాధ నుంచి త్వరగా కోలుకుని మనో ధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతున్ని కోరుకుంటున్నా.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవ తార చేరిందని బాలకృష్ణ అన్నారు. నటనలో కిరీటి, సాహసానికి మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దాన కర్ణుడు కృష్ణ అని అన్నారు బాలకృష్ణ. తెలుగులో కౌ బోయ్ సినిమాలకు ఆద్యుడు.. గూఢాచారి సినిమాల్లో ఘనాపాఠి, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి.. ఇటీవల తల్లిని ఇప్పుడు తండ్రిని కోల్పోయిన మహేష్ కి ఇది తీరని వేదమ అన్నారు బాలకృష్ణ.

కృష్ణ గారు తెలుగు వారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి. ఆయనే మన జేమ్స్ బాండ్.. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషి గా సినీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేకతని సంపాదించుకున్న కృష్ణ గారి మరణం తెలుగు సినీ రంగానికి.. తెలుగు వారికి తీరని లోటు. మహేష్ బాబుకి, కృష్ణ గారి కుటుంబ సభ్యులందరికి, ఈ కష్ట సమయంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.