Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బికినీ తొడిగిన ప‌ద్మం

By:  Tupaki Desk   |   3 Sep 2018 6:48 AM GMT
ఫోటో స్టోరీ: బికినీ తొడిగిన ప‌ద్మం
X
ప‌ద్మాల‌క్ష్మి .. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. టాప్ మోడ‌ల్ కం టీవీ హోస్ట్‌. హాలీవుడ్ న‌టిగా సుప‌రిచితం. అంత‌కుమించి గ్రేట్ రైట‌ర్ స‌ల్మాన్ ర‌ష్ధీ భార్యామ‌ణి. ప్ర‌ఖ్యాత టీవీ చానెల్లో టాప్ చెఫ్ రియాలిటీ షోతో ఎమ్మీ అవార్డ్ అందుకున్న మేటి చెఫ్‌గానూ ఈవిడ సుప‌రిచితురాలు. ``ప్యారిస్‌ - మిల‌న్ - న్యూయార్క్ లాంటి చోట్ల కెరీర్‌ ని కొన‌సాగించ‌గ‌లిగిన ద‌మ్మున్న మేటి ఇండియ‌న్ గాళ్ నేను`` అని గ‌ర్వంగా చెప్పుకునే ప‌ద్మాలక్ష్మికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులున్నారు.

ప‌ద్మా ల‌క్ష్మి అకౌంట్లో కాస్ట్‌లీ బ్రాండ్లు ఉన్నాయి. జార్జియో ఆర్మ‌ణీ - జియానీ వెర్సాస్ - రాల్ఫ్ లారెన్‌ - ఆల్బెర్టా ఫెరారి - ఇమాన్యుయేల్ అన‌గారో వంటి ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు ప‌ద్మాల‌క్ష్మి మోడ‌లింగ్ చేసింది. `క‌రేబి: బ‌్ల‌డ్ బ్ర‌ద‌ర్స్` - ఐ విల్ ఫిగ్‌లియో డి సండోకాన్ వంటి హాలీవుడ్ (ఇటాలియ‌న్ పైరేట్‌) చిత్రాల్లో న‌టించింది. 1999లో ర‌చ‌యిత స‌ల్మాన్ ర‌ష్ధీతో ప‌రిచ‌య‌మై, ఐగేళ్ల ప్రేమాయ‌ణం అనంత‌రం 2004లో ఆయ‌న్ను పెళ్లాడింది. అటుపై విడాకుల ఫ‌ర్వం తెలిసిందే. ప్ర‌స్తుతం ఓ బిడ్డ‌కు త‌ల్లి. ఒంట‌రినే కానీ రెయిజింగ్ స్టార్‌ని అని గ‌ర్వంగా చెప్పుకుంటుంది ప‌ద్మాల‌క్ష్మి.

ఇదిగో ఈ బికినీ చూశాక‌.. త‌న‌లోని కాన్ఫిడెన్స్ లెవ‌ల్ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. టూపీస్‌ కి బ్రాండ్ అంబాసిడ‌రా? బికినీ కోసం బ్ర‌హ్మ చెక్కిన శిల్ప‌మా? అంటూ యూత్ ఒక‌టే ఇదైపోవ‌డం ఖాయం. సప్త స‌ముద్రాల్లో క‌రేబియ‌న్ బందిపోటులా .. ఆర‌డుగుల బుల్లెట్టులా.. ప‌ద్మాల‌క్ష్మి ఇచ్చిన ఫోజు చూశాక 20 నుంచి 60వ‌ర‌కూ షేక్ అవ్వ‌నివాళ్లుంటారా? బికినీ తొడిగిన ప‌ద్మం అంటూ మైమ‌రిచిపోరూ..