Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్ రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ
By: Tupaki Desk | 27 Feb 2021 9:40 AM ISTసూపర్ హిట్ హాలీవుడ్ ప్రాంచైజీ ఫిల్మ్ హ్యారీ పోటర్ లో బాల నటిగా నటించి మెప్పించిన ఎమ్మా వాట్సన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. 2001 నుండి అంటే రెండు దశబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను అలరిస్తూ ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్న ఎమ్మా వాట్సన్ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. కొత్త సినిమాల విషయంలో కూడా ఆమె నిర్ణయాన్ని తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. దాంతో ఇటీవల ఎమ్మా వాట్సన్ సినిమాకు రిటైర్మెంట్ తీసుకుందంటూ ప్రచారం జరిగింది. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేయడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత తక్కువ వయసులోనే రిటైర్మెంట్ ఏంటీ అంటూ పెదవి విరిచారు.
ఎమ్మా వాట్సన్ రిటైర్మెంట్ వార్తలపై ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చాడు. ఎమ్మా సోషల్ మీడియా అకౌంట్ లు యాక్టివ్ గా లేవు నిజమే. ఆమె ప్రస్తుతం లియో రాబింటన్ తో ప్రేమలో ఉందన్నాడు. త్వరలోనే వారిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారని పేర్కొన్నాడు. ఆమె సినిమాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం సినిమాలకు దూరంగా ఉండటం కేవలం తాత్కాలికమే అన్నాడు. త్వరలోనే ఆమె మళ్లీ తన అభిమానుల ముందుకు రాబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మళ్లీ వెండి తెరపై కనిపించే అవకాశం ఉందేమో అంటున్నారు. మొత్తానికి ఎమ్మా ఇంతకు ముందు మాదిరిగా జోరుగా సోషల్ మీడియాలో కాని సినిమాల్లో కాని కనిపించక పోవచ్చు. ఎమ్మా కు ఇన్ స్టా గ్రామ్ లో 50 మిలియన్ లను మించిన ఫాలోవర్స్ ఉన్నారు.