Begin typing your search above and press return to search.

EMK : హాట్ సీట్ భయపెడుతుందన్న సమంత

By:  Tupaki Desk   |   10 Oct 2021 9:55 AM GMT
EMK : హాట్ సీట్ భయపెడుతుందన్న సమంత
X
ఎవరు మీలో కోటీశ్వరులు షో దసరా స్పెషల్‌ ఎపిసోడ్ లో సమంత రాబోతున్నట్లుగా గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లుగా తాజాగా జెమిని టీవీ ప్రోమో విడుదల చేసింది. చాలా కూల్‌ అండ్ క్యూట్‌ లుక్ లో హాట్ బ్యూటీ సమంత ఆకట్టుకునే రీతిలో ఎన్టీఆర్ షో లో కనిపించింది. ఎన్టీఆర్ వెల్‌ కమ్‌ తో స్టైలిష్‌ ఎంట్రీ ఇచ్చిన సమంత హాట్ సీట్ లో కూర్చుంది. హాట్‌ సీటులో కూర్చుతున్న తర్వాత భయంగా ఉందని నవ్వుతూ అనేసింది. ఎన్టీఆర్‌ మరియు సమంతల మద్య గేమ్‌ ఎలా సాగింది.. సమంత ఎంత వరకు గెలుచుకుంది అనేది ప్రస్తుతం ఆసక్తిగా ఉంది.

నవరాత్రుల స్పెషల్‌ సందర్బంగా ఆడవారు మాత్రమే ఈ వారం మొత్తం కంటెస్టెంట్స్ గా ఉన్నారు. వచ్చే వారంలో కూడా ఆడవారికే అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమంత ఆ స్పెషల్‌ వీక్ కు స్పెషల్‌ గెస్ట్‌ గా కనిపించబోతుంది. సమంత చాలా యాక్టివ్‌ గా ఇలాంటి షో ల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ మరియు సమంతల మద్య మంచి ఆసక్తికర చర్చలు మరియు విషయాలు వచ్చి ఉంటాయి అనిపిస్తుంది. సమంత మరియు ఎన్టీఆర్‌ ల కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. ఇద్దరు కూడా ప్రొఫెషనల్‌ గా మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వారే. కనుక ఖచ్చితంగా వీరి కాంబోలో ఈ షో ఇంట్రెస్టింగ్‌ గా సాగుతుందని అంటున్నారు.

నవరాత్రుల సందర్బంగా అంటూ ప్రోమో విడుదల చేశారు. కాని ఇప్పటి వరకు సమంత వచ్చే సరైన తేదీని మాత్రం ప్రకటించలేదు. ఒకటి రెండు రోజుల్లో ఆ విషయమై కూడా క్లారిటీ వస్తుందేమో చూడాలి. దసరా సందర్బంగా సమంత వస్తుందనే విషయం అందరికి తెల్సిందే. అదే విషయాన్ని జెమిని టీవీ వారు త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి. మహేష్‌ బాబు కూడా ఈ షో లో పాల్గొనబోతున్నాడు. ఆయన ఎపిసోడ్‌ ను దీపావళి కానుకగా టెలికాస్ట్‌ చేస్తారేమో చూడాలి. ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఆశించిన స్థాయిలో రేటింగ్‌ దక్కడం లేదు. ఇలా సెలబ్రెటీ స్పెషల్ ఎపిసోడ్స్ తో అయినా షో ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. సాదారణ ఎపిసోడ్స్ తో పోల్చితే సెలబ్రెటీ ఎపిసోడ్స్ కు రికార్డు స్థాయి రేటింగ్‌ వస్తుంది. అందుకే దసరా కు సమంత.. ఆ తర్వాత మహేష్‌ బాబు... తమన్నాలు కూడా షో లో కనిపించబోతున్నారు.