Begin typing your search above and press return to search.

గ్రీకు సుంద‌రి జీవితం త‌ల‌కిందులు

By:  Tupaki Desk   |   3 Nov 2020 8:45 AM IST
గ్రీకు సుంద‌రి జీవితం త‌ల‌కిందులు
X
ఎల్లీ అవ్ రామ్‌.. ఇండియ‌న్ స్క్రీన్ పై గ్రీకు సుంద‌రిగా పాపుల‌ర్. `ప‌ర‌దేశి` డ్యాన్స్ గ్రూప్ ‌తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్వీడ‌న్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ బిగ్ ‌బాస్ సీజ‌న్ 7తో లైమ్ ‌లైట్ ‌లోకి వ‌చ్చింది. వ‌స్తూనే బాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించింది. బిగ్ బాస్ నాటి సీజ‌న్ ‌కే త‌న‌దైన స్టైల్ డ్యాన్సుల‌తో మ‌రింత అందాన్ని తీసుకొచ్చింది. ఆ త‌రువాత `మిక్కీ వైర‌స్‌` చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రంలోని ఐట‌మ్ సాంగ్ లో మెరిసి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ఇండియ‌న్ క్రికెట‌ర్ హార్ధిక్ పాండ్యాలో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలిన ఈ స్వీడ‌న్ సుంద‌రి ఉన్న‌ట్టుండి అత‌గాడు షాకివ్వ‌డంతో బిత్త‌ర‌పోయింది. త‌న‌ని కాద‌ని హార్థిక్ పాండ్యా న‌టాషాని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ జంట‌కు ఇటీవ‌ల ఓ కిడ్ కూడా జ‌న్మించాడు.

పాండ్యా ఇచ్చిన ఒకే ఒక్క ఝ‌ల‌క్ ని ఎల్లీ అస్స‌లు జీర్ణించుకోలేకపోతోంద‌ట‌. లైఫ్ జ‌ర్నీ ఎక్క‌డో వుండాల్సిన ఎల్లీ అవ్ర‌మ్ లైఫ్ ఒక్క‌సారిగా ఊహించ‌నిది ఎదురు కావ‌డంతో అంతా తల్ల‌‌కిందులైపోయింది. ``ప్రపంచం ప్రస్తుతం నాకు త‌ల‌కిందులుగా క‌నిపిస్తోంది. మీకు ఇలాగే వుందా?`` అంటూ అమ్మ‌డు నిర్వేదం ప్ర‌ద‌ర్శిస్తూ త‌ల‌కిందులుగా వున్న త‌న ఫొటోని షేర్ చేసింది. అవును ఇలాంటి అనుభ‌వం ఎదురైతే ఎవ‌రి జీవిత‌మైనా త‌ల‌కిందులేగా.. అంటూ బోయ్స్ ఒక‌టే కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.