Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కరేబియ‌న్ దీవి నుంచి దారి త‌ప్పిందా?

By:  Tupaki Desk   |   10 Dec 2020 4:00 PM IST
ఫోటో స్టోరి: కరేబియ‌న్ దీవి నుంచి దారి త‌ప్పిందా?
X
విదేశీ ముద్దుగుమ్మ ఎల్లీ అవ్ రామ్ ఇన్ స్టా వేషాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. నిరంత‌రం అగ్గి రాజేసే బికినీల‌తో చెల‌రేగ‌డం ఈ అమ్మ‌డికి అల‌వాటు వ్యాప‌క‌మే.

ఇటీవ‌లే మాల్దీవుల నుంచి అదిరిపోయే బికినీ ట్రీట్ తో మురిపించింది. బికినీ స్విమ్ సూట్ లో బీచ్ ఇసుక‌ల్లో వ‌రుస‌ ఫోటోషూట్ల‌తో దుమారం రేపింది. ఒంట‌రి దీవుల్ని షేక్ చేసింది ఎల్లీ.

తాజాగా ఈ భామ వ‌రుస‌గా త్రోబ్యాక్ ఫోటోల్ని షేర్ చేస్తూ మ‌రింత‌గా అగ్గి రాజేస్తోంది. `మీ పూర్వీకులు ఎవ‌రో తెలుసుకోవాలంటే ఇలా ప్ర‌కృతిలో క‌లిసిపోవాలి` అంటూ ఎల్లీ అదిరిపోయే ఫోటోని షేర్ చేసింది. ఇంత‌గా ప్ర‌కృతితో మ‌మేకం అయితే నిజంగానే పూర్వీకులు క‌నిపిస్తారో లేదో కానీ... ఎల్లీని ఇలా చూస్తే కంటికి కునుకు ప‌ట్ట‌క కుర్ర‌కారు క‌ల‌త‌నిద్ర‌కు గుర‌వ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. క‌రేబియ‌న్ దీవుల నుంచి దారి త‌ప్పిన దేవ‌క‌న్య‌లా అవ్ రామ్ ఇచ్చిన ఫోజు ప‌రేషాన్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ న‌టించిన ప్యారిస్ ప్యారిస్ (క్వీన్ రీమేక్) రిలీజ్ కి రావాల్సి ఉంది. కాజ‌ల్ అందులో మెయిన్ లీడ్ ని పోషించింది.