Begin typing your search above and press return to search.
సోదరుడికి బ్రెయిన్ ట్యూమర్ కుప్పకూలిన నటి!
By: Tupaki Desk | 22 Jan 2022 8:45 AM ISTస్వీడిష్ గ్రీక్-ఇండియన్ నటి ఎల్లీ అవ్రామ్ కన్నీటి బొట్లు ప్రతి హృదయాన్ని ద్రవింపజేసాయంటే అతిశయోక్తి కాదు. ఇంతకుముందు మనీష్ పాల్ పోడ్ కాస్ట్ లో తన సోదరుడి బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దిగ్భ్రాంతికరమైన వార్త గురించి తన తల్లిదండ్రుల నుండి కాల్ వచ్చినప్పుడు నటుడు మనోజ్ బాజ్‌పేయితో కలిసి ఒక వాణిజ్య ప్రకటన కోసం తాను షూటింగ్ చేస్తున్నానని అవ్ రామ్ వెల్లడించింది.
పోడ్ కాస్ట్ లో తన సోదరుడికి వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఉందని అయితే కెరీర్ పరమైన పని ఒత్తిడిలో ఉన్నానని వెల్లడించారు. 2019లో నేను మళంగ్ చిత్రీకరణ కోసం షూటింగ్ ని ప్రారంభించాను. నేను బ్యాక్ టు బ్యాక్ షూట్ లు చేస్తున్నాను. ఒక రోజు మనోజ్ బాజ్ పేయితో కలిసి ఈ ప్రకటన చేస్తున్నాను. మా సోదరుడి గురించి మా తల్లిదండ్రుల నుండి నాకు కాల్ వచ్చింది. అతను కుప్పకూలిపోయాడు.. వారు బ్రెయిన్ ట్యూమర్ ని కనుగొన్నారు. ఇది చాలా పెద్ద షాక్ అని అవ్రామ్ వెల్లడించారు.
ఎల్లి అవ్రామ్ తన కన్నీళ్లను ఆపుకుంటూ తనకు సెట్స్ లో ఏడవడం ఇష్టం లేదని అందుకే తన మేనేజర్ తో కాకుండా ఎవరితోనూ ఆ విషయాన్ని పంచుకోలేదని చెప్పింది. మానసికంగా గందరగోళంగా' ఉన్నప్పటికీ తనకు బెస్ట్ షాట్ ఇచ్చేందుకు ప్రయత్నించానని ఎల్లీ చెప్పింది. ``నేను పూర్తిగా షాక్ అయ్యాను .. మా మేనేజర్ కి ఏదీ చెప్పలేదు. నేను ఎవరికైనా చెబితే మొత్తం షూట్ ని మేకప్ ను చెరిపేసి నాశనం చేస్తానని ఆలోచించాను`` అని ఆమె చెప్పింది.
ఎల్లీ మరిన్ని విషయాలు మాట్లాడుతూ.. తాను షూట్ పూర్తి చేశానని చివరకు తన కుటుంబంతో మాట్లాడేందుకు సమయం దొరికిందని చెప్పింది. ఎల్లి ఎమోషనల్ గా ఆమె ఇంటికి వచ్చిన నిమిషంలో ఆమె చిద్రమైపోయింది. గుండెలు పగిలేలా ఏడ్చింది. 12 ఏళ్లుగా మిలిటరీలో ఉన్న ఎల్లీ సోదరుడు ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. కోలుకుంటున్నాడని మనీష్ వెల్లడించారు. ఇది ఇంతకుముందు ఇంటర్వ్యూ అయినా కానీ దానిపై ఎల్లీ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అవ్రామ్ కిస్ కిస్కో ప్యార్ కరూన్,.. మిక్కీ వైరస్ - మోహిత్ సూరి మళంగ్ చిత్రాల్లో నటించారు. ఆదిత్య రాయ్ కపూర్- అనిల్ కపూర్- దిశా పటాని- కునాల్ ఖీము కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఎల్లీ జెస్సీ పాత్రను పోషించింది. బిగ్ బాస్ 7 ఫేమ్ గానూ ఎల్లీ ప్రముఖ సిరీస్ ఇన్ సైడ్ ఎడ్జ్ లో భాగం అయ్యింది. ఆమె అమీర్ ఖాన్ తో కలిసి ఫిదాయ్ మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది.