Begin typing your search above and press return to search.

రెండ్రోజులు ఎండ‌లో ప‌ని చేశాక ఎల్లీ ఇలా అయ్యింది!

By:  Tupaki Desk   |   6 July 2021 7:00 AM IST
రెండ్రోజులు ఎండ‌లో ప‌ని చేశాక ఎల్లీ ఇలా అయ్యింది!
X
స‌ల్మాన్ భాయ్ `బాడీగార్డ్` చిత్రంలో న‌టించిన ఎల్లి అవ్ రామ్ ఆ త‌ర్వాత సౌత్ సినిమాల్లోనూ అడ‌పాద‌డ‌పా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీమిండియా హార్డ్ హిట్ట‌ర్ హార్థిక్ పాండ్యాతో ప్రేమాయ‌ణం సాగించిన ఈ బ్యూటీ పేరు అప్ప‌ట్లో ప్ర‌ముఖంగా హెడ్ లైన్స్ లో నిలిచింది.

హార్థిక్ తో ప్రేమాయ‌ణం సాగించే క్ర‌మంలో అత‌డు ఇచ్చిన జోల్ట్ ని మ‌ర్చిపోలేదు ఎల్లీ. చివ‌రి నిమిషంలో అత‌డు వేరే భామ‌కు క‌మిటైపోవ‌డంతో కొంత హ‌ర్ట్ అయ్యింది. అయినా ఏదో అయిపోయింద‌ని బెంగ పెట్టుకోకుండా వెంట‌నే కోలుకోగ‌లిగింది. ప్రేమ వైఫ‌ల్యం అనంత‌రం ఎల్లీ అవ్ రామ్ తిరిగి త‌న కెరీర్ పై దృష్టి సారించింది. ఇటీవ‌ల క్వీన్ రీమేక్ `పారిస్ పారిస్`లో కాజ‌ల్ తో పాటు న‌టించింది. కానీ ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. మూవీ ప్ర‌మోష‌న్స్ లో కాజ‌ల్ ఎద అందాల‌పై చేయితో త‌డుముతూ ఎల్లీ చేసిన ప‌ని అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే అయ్యింది.

ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో ఈ బ్యూటీ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేస్తూ హీట్ పెంచేస్తోంది. తాజాగా ఎల్లీ అవ్ రామ్ పూల్ సైడ్ ట్రీట్ హాట్ టాపిక్ గా మారింది. రెండ్రోజుల పాటు ఎండ‌లో తీవ్రంగా శ్రమించింద‌ట‌. ఆ త‌ర్వాత ఇలా మారాను అని పూల్ లో స్విమ్ చేసి అటుపై రిలాక్స్ అవుతున్న ఫోటోని షేర్ చేసింది. ఔట్ డోర్ లో ఎండ‌లో షూట్ చేసినంత మాత్రాన మ‌రీ ఇంత‌గా చిల్ అవ్వాలా? అంటూ బోయ్స్ ఈ ఫోటో చూసి కామెంట్లు రువ్వుతున్నారు. పింక్ ఫ్లోర‌ల్ బికినీలో ఎల్లీ అగ్గి రాజేస్తోంది.

ఇక ఈ బ్యూటీ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రూహీ అఫ్జానా.. బ‌ట‌ర్ ఫ్లై చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో మంట‌లు పెట్టే ఎక్స్ పోజింగ్ తో చెల‌రేగ‌నుంద‌ని స‌మాచారం. ఇంత‌కుముందు మ‌లంగ్ లోనూ ఎల్లీ అగ్గి రాజేసింది.