Begin typing your search above and press return to search.

వీడియో: క‌ల నిజ‌మైందంటూ చెల‌రేగిపోయింది

By:  Tupaki Desk   |   5 Nov 2020 1:40 PM IST
వీడియో: క‌ల నిజ‌మైందంటూ చెల‌రేగిపోయింది
X
సుదూర తీరంలో ఒంట‌రి దీవీలో తాను ఒక్క‌త్తె ఉండాలి. అక్క‌డ బులుగు స‌ముద్రం .. కెర‌టాల నుంచి దూసుకొచ్చే తెమ్మెర గాలి.. ఆకాశంలోంచి తొంతి చూస్తున్న సూర్యుడు.. మాత్ర‌మే అక్క‌డ ఉండాలి. అలాంటి చోట ఒంట‌రిగా ఇదిగో ఇలా చెల‌రేగిపోవాలి!! అని చెబుతోంది ఎల్లీ అవ్ రామ్.

ప్రియుడు హార్థిక్ పాండ్యా (ఇపుడు ఎక్స్ బోయ్ ఫ్రెండ్) హ్యాండిచ్చినా అదేమీ ఈ అమ్మ‌డిలో క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల సోలోగానే ఉన్నా చిలౌట్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. పాల నురుగు దేహ‌శిరుల్ని అలా ఇసుక తిన్నెల న‌డుమ ఎంతో అందంగా ఆవిష్క‌రిస్తున్న ఈ వీడియో సునామీ స్పీడ్ తో బోయ్స్ లోకి దూసుకెళ్లింది. ఎల్లీ నిను చూస్తే నా గుండె గుల్లే అంటూ ఇదిగో త‌ను షేర్ చేస్తున్న రెగ్యుల‌ర్ వీడియోలు చూస్తూ యూత్ మెంట‌లెక్కిపోతోంది. క‌ల నిజ‌మైందిలే అంటూ ఇదిగో ఇలా చెల‌రేగిపోయింది ఎల్లీ.

లాక్ డౌన్ అనంత‌రం ప్ర‌తి ఒక్క‌రూ షూటింగుల‌తో బిజీ అవుతుంటే ఎల్లీ మాత్రం ఇలా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అన్న‌ట్టు త‌న ఫ్రెండు కాజ‌ల్ స‌డెన్ గా ప్రియుడు గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడేసింది. త‌న‌తో క‌లిసి న‌టించిన పారిస్ పారిస్ ఎప్ప‌టికి రిలీజ‌వుతుందో కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు ఎల్లీ.