Begin typing your search above and press return to search.

సెక్స్‌ సీన్లు చేయనని ఏడిస్తే కుదరదు

By:  Tupaki Desk   |   9 April 2015 5:30 AM GMT
సెక్స్‌ సీన్లు చేయనని ఏడిస్తే కుదరదు
X
ఏక్తా కపూర్‌ .. ఈ పేరే ఒక బ్రాండ్‌. ఈవిడ బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌. రాగిణి ఎంఎంఎస్‌, లవ్‌ సెక్స్‌ ఔర్‌ ధోఖా, ది డర్టీ పిక్చర్‌.. వంటి సంచలనాల్ని నిర్మించిన నిర్మాత. ఈ సినిమాలన్నీ సెక్స్‌ అనే కంటెంట్‌ చుట్టూ తిరిగేవే. అయినంత మాత్రాన ఏక్తను అనాలంటే గుండెలనిండా దమ్ముండాలి.

అసలు ఏక్త ఓ సినిమా తీస్తోంది అంటే ప్రపంచం మొత్తం అటువైపు చూడాల్సిందే. సెక్స్‌, న్యూడిటీ అనే రెండు అంశాలు ప్రాతిపదికగా, పక్కా వాణిజ్య పంథా సినిమాల్ని తెరకెక్కించడంలో ఏక్త పనితనాన్ని పొగడాల్సిందే. నష్టం అనే మాటే లేకుండా సినిమాని మార్కెట్‌ చేయడంలో నిర్మాతగా వంద శాతం సక్సెస్‌ అయిన ఏక్త ప్రస్తుతం ఎక్స్‌ఎక్స్‌ఎక్స్‌ అనే సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులంతా ఓ అగ్రిమెంట్‌ మీద సంతకం చేయాల్సిందే. సినిమాలో ఉండేదంతా న్యూడ్‌. నగ్నంగా కనిపించాలి. సెక్స్‌ చేయడానికి, లిప్‌లాక్‌లకు, బికినీలకు సిద్ధపడి రావాల్సిందే. సీన్‌ తీసేప్పుడు ఎవరైనా ఏడుస్తానంటే కుదరదు. అని ఓ కొత్త క్లాజ్‌ను ప్రవేశపెట్టి మరీ అగ్రిమెంట్‌ తీసుకుంటోంది.

ఎందుకంటే తన గత సినిమాల విషయంలో అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు కథానాయికలంతా ఏడుపుముఖం పెట్టేశారట. అందుకే ఇలా కఠినమైన నియమాల్ని తయారు చేసుకుందన్నమాట!